గుర్మీత్ ఓ సైకో-వెలుగులోకి మరిన్ని అకృత్యాలు

అత్యాచారం కేసులో సీబీఐ కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించిన డేరా బాబాకు సంబంధించిన వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులేకి వస్తున్నాయి. ఆధ్యత్మికత పేరుతో రామ్ రహీమ్ గుర్మీత్ సింగ్ సాగించిన అరచకాలను ఆయన మాజీ అంగరక్షకుడు ఒకరు వెల్లడించారు. ఆయన చెప్పిన విషయాలు ఒళ్లు గగ్గుర పర్చేవిగా ఉన్నాయి. రామ్ రహీమ్ గుర్మీత్ సింగ్ అత్యంత అమానుషంగా సైకో మాదిరిగా వ్యవహరించేవాడని గతంలో డేరా బాబా వద్ద అంగరక్షకుడిగా పనిచేసిన బియాంత్ సింగ్ చెప్పాడు. మహిళలపై అక్రుత్యాలకు పాల్పడడం అతని అలవాటేనని చెప్పారు. ఎంతో మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్టు అతను వెల్లడించాడు. ఆశ్రమంలో ఉన్న మహిళల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించేవాడని, చిన్న పిల్లలపై కూడా అత్యాచారాలకు పాల్పడేవాడని తెలిపాడు. బాబా తన మహిళా శిష్యురాళ్లని సాద్వీలుగా చెప్తూ వారితో అసభ్యంగా ప్రవర్తించేవాడని బియాంత్ సింగ్ పేర్కొన్నాడు. ఎంతో మంది సాధ్వీలతో అతను అసభ్యంగా ప్రవర్తించడంతో పాటుగా వారిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలు తనతో పాటుగా డేరా బాబా వద్ద పనిచేసిన కొంత మందికి తెలుసని చెప్పాడు. సాధ్వీలపై అత్యాచారాలు జరపడంతో పాటుగా వారిని బంధీలుగా ఉంచుకునేవాడని వంతుల వారిగా బాబా వద్దకు సాధ్వీలు వచ్చే వారని వెల్లడించారు. ఒక 16 సంవత్సరాల బాలికపై అత్యంత దారుణంగా అత్యాచారం జరిపి ఆమెని నానా రకాలుగా హింసించేచాడని తనతో పాటుగా మరికొంత మంది ఈ అఘయిత్యాలను చూసినా ఏమి చేయలేక మౌనం దాల్చినట్టు వివరించారు.
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడడంతో పాటుగా ఆశ్రమంలో ఉన్న మగవారిని నపుశంకులుగా మార్చేవాడని బియాంత్ సింగ్ చెప్పాడు. తనను కూడా నంపుశకుడిగా మార్చే ప్రయత్నం చేయడంతో తాను అక్కడి నుండి పారిపోయి విదేశాలకు వెళ్లిపోయినట్టు బియాంత్ సింగ్ తెలిపాడు. తనకు అడ్డు వచ్చే వారిని అత్యంత కిరాతకంగా హత్య చేయడం డేరా బాబాకు అలవాటేనని బియాంత్ సింగ్ అంటున్నాడు. చంపిన వారిని ఆశ్రమంలోనే పూడ్చిపెట్టేవారని కొంత మంది సమీపంలోని చెరువులో విసిరేసేవారని బియాంత్ సింగ్ వివరించారు. భూములను కబ్జా చేయడంలోనూ రామ్ రహీం బాబు సిద్ద హస్తుడని బియాంత్ సింగ్ అంటున్నాడు. వేలాది ఎకరాలు భూములను అక్రమించుకున్నాడని చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *