ఘనంగా ఉప్పల్ లో అయ్యప్ప శోభాయాత్ర

ఉప్పల్ లో అయ్యప్ప స్వామి శోభయాత్ర ఘనంగా జరిగింది. ఉప్పల్ కమాన్ మీదుగా అయ్యప్ప స్వామి దేవాలయం వరకు సాగిన శోభయాత్ర కన్నుల పండుగ్గా సాగింది. గుర్రాలమీద ఆశీనులైన అయ్యప్ప స్వాములు ముందు రాగా వారి వెనకాల అయ్యప్ప భక్తిపాటలకు లయబద్దంగా నాట్యం చేస్తున్న స్వాములు కదలగా వారి వెనుక గరగ నృత్యకారులు, కేరళకు చెందిన వాయిద్య బృందం విన్యాసాలు ఆకట్టుకున్నాయి. దాని వెనుక వివిధ దేవతా రూపాలు కదిలి వచ్చాయి. అమ్మవారు, వేంకటేశ్వరస్వామి రూపాల్లో కళాకారులు సందడి చేశారు. దాని వెనుక సప్తాశ్వ రధంపై హరిహర తనయుడు కొలువుదీరాడు.
బాణాసంచాల వెలుగులు వెదజల్లగా విద్యుతు దీపాల కాంతులు కన్నుల పండుగ చేశాయి. పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక నేత బోరంపేట మురళి ఆధ్వర్యంలో శోభయాత్రకు స్వాగతం పలికారు.