ఆసీస్ క్రికెటర్ల బస్సుపై రాయి దాడి

ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు రాయి విసిరిన ఘటనతో ఆసిస్ ఆటగాళ్లకు మరింత భద్రతను పెంచారు. గౌహతీలో టీ-20 మ్యాచ్ అనంతరం ఆసిస్ ఆటగాళ్లు హోటల్ కు బయలుదేరుతున్న సమయంలో ఎవరో విసిరిన రాయి తలిగి బస్సు అద్దం పలిగిపోయింది. అద్దం పగిలిన చోట ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. బస్సు అద్దం పగిలిన ఫొటోను ఆసిస్ ఆటగాడు అరోస్ పించ్ ట్విట్టర్ లో ఉంచాడు. స్టేడియం నుండి హోటల్ కు వెళ్తున్న సమయంలో ఎవరో విసిరన రాయి తగిలి అద్దం పగిలింది. కొంచెం భయం వేసిందని ఆ ఆటగాడు ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఆ సమయంలో ఎవరూ అక్కడ కూర్చోకపోవడంతో ప్రమాదం తప్పిందని అన్నాడు.
ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై రాయి విసిరిన ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. ఈ చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా చెప్పారు. అస్సోం ప్రజలు శాంతి కాముకులని అయినా ఎవరో ఆకతాయి చేసిన పనికి క్షమాపణలు చెప్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన నేపధ్యంలో ఆసిస్ ఆటగాళ్లుకు మరింత భద్రతను పెంచారు. టి-20 మ్యాచ్ లో భారత్ దారుణంగా ఓడిపోవడాన్ని తట్టుకోలేని వారు ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *