వైఎస్ జగన్ పై దాడి-స్వల్ప గాయం

0
91

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి జరిగింది. విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు వచ్చేందుకు విమానాశ్రయానికి వస్తున్న జగన్ అక్కడి లాంచ్ లో వేచిఉన్న సమయంలో చిన్న చాకుతో జగన్ పై ఒక వ్యక్తి దాడికి దిగాడు. సెల్ఫీ కోసమంటూ జగన్ కు అత్యంత దగ్గరగా వచ్చిన సదరు వ్యక్తి ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగాడు. చిన్నపాటి కత్తితో జగన్ ను పొడవడంతో ఆయన బుజం మీద చిన్నపాటి గాయం అయింది.
విమాశ్రయంలోనే ఆయనకు ప్రథమ చికిత్సను అందించినతరువాత జగన్ హైదరాబాద్ కు బయలు దేరాడు. కోడిపందాల సమయంలో కోడి కాళ్లకు కట్టే చిన్నపాటి కత్తితో జగన్ పై దాడిజరిగింది. దాడిచేసిన వ్యక్తి ఎయిర్ పోర్టులోని క్యాంటిన్ లో పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతని పేరు రాజు అని అమలాపురానికి చెందిన వ్యక్తిగా పోలీసులు వెల్లడించారు. అయితే జగన్ పై అతను ఎందుకు దాడికి దిగాడనే విషయం తెలియలేదని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు.
జగన్ పై దాడి ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే ఎయిర్ పోర్టులోకి కత్తితో ఒక వ్యక్తి రావడం అనుమానాలకు తావిస్తోందని వారంటున్నారు. దీనిపై పూర్తిగా స్థాయిలో దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ys jagan, ys jagan mohan reddy.

Wanna Share it with loved ones?