చిన్నారుల పై అఘాయిత్యాలు దారుణం

చిన్నారుల పై అఘాయిత్యాలు జరగడం దారుణమని వాటిని వెంటనే అరికట్టలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ‘ఫోరం ఫర్ మెడ్రనెస్ట్ ఇండియా ‘ డిమాండ్ చేసింది. చిన్నారులై అకృత్యాలను ఆపాలంటూ సంస్థ సభ్యులు దిల్ షుఖ్ నగర్ పీ అండ్ టీ కాలనీ లో ర్యాలీ నిర్వహించారు. చిన్నారులపై పాశవికంగా అత్యాచారాలు జరిపి వారిని హత్యచేయడం దారుణమని ఇటువంటి నేరాలకు పాల్పడినవారిపై కనికరం చూపించాల్సిన అవసరం లేదని సంస్థ సభ్యులు అభిప్రాయపడ్డారు. జమ్మతో పాటుగా ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన అత్యాచార ఘటనలపై సంస్థ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలకు పాల్పడిన వ్యక్తులకు సమాజంలో ఉండే అర్హతలేదన్నారు. ఇటువంటి ఘటనలు జరిగినపుడు ప్రతీ ఒక్కరూ ముందుకు వచ్చి ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న పిల్లలపై దారుణాలకు పాల్పడిన వారు మృగాలకంటే హీనమని ఆయన అన్నారు. అత్యాచర ఘటనలు మతం, రాజకీయ రంగు పులుపుకోవడం దురదృష్టకరమని సంస్థ ప్రధాన కార్యదర్శని వై.వి.రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి దారుణాలకు పాల్పడిన వ్యక్తులు ఏ మతం, కులం వారైన కఠిన దండన విధించాల్సిందే అన్నారు. చిన్నారులను చిదిమేసే వ్యక్తులకు మద్దతు పలకడం హేయమని ఆయన అన్నారు. దేశంలో నిర్భయ లాంటి చట్టాలు అమలులోకి వచ్చిన తరువాత కూడా మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని మరీ ముఖ్యంగా చిన్నారులను లక్ష్యంగా చేసుకుని వారిపై అఘాయిత్యాలకు పాల్పడడం దారుణమన్నార. ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పోస్ట్లల్ ఉద్యోగుల సంఘం నాయకులు జి.జనార్థన్, కాంగ్రెస్ సీనియర్ నేత ఎం. ప్రభాకర్, తెలంగాణ ఎన్జీఓ నాయకుడు రాజేశ్వర్, ముదిరాజ్ సంఘం నాయకుడు సత్యనారాయణ ముదిరాజ్, పీ అండ్ టీ కాలనీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి టి.మహేశ్ తదితరులు హాజరయ్యారు.
అసలు నిజాలు

Women_in_India
rights
Sexual_violence