అటల్ బిహారీ వాజ్ పేయి జీవిత విశేషాలు

0
84
వాజ్ పేయి జీవిత చరిత్ర

గంగా ప్రవాహం లాంటి ఆయన వగ్ధాటి ఆయన సొంతం. సహజంగా కవి అయిన అటల్ బిహారీ వాజ్ పేయి మాట్లాడుతుంటే ఎవరైనా చెవులు రిక్కించి వినాల్సిందే. తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడే వ్యక్తిగా అందరి ప్రశంశలు అందుకునే వాజ్ పేయి లాంటి నాయకులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తన సుదీర్ఘరాజకీ జీవితంలో ఎటువంటి మచ్చా లేకుండా ఉన్న అతికొద్దిమంది రాజకీయ నేతల్లో ఆయన ఒకరు. వాజ్ పేయిని రాజకీయంగా విభేదించే వాళ్లు ఉండవచ్చు కానీ వ్యక్తిగతంగా ఆయన్ను విమర్శించే వాళ్లే లేరు. “ భారత రత్న” వాజ్ పేయి కు సంబంధించిన కొన్ని విశేషాలు…
• 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించిన వాజ్ పేయి.
• తల్లిదండ్రులు కృష్ణాదేవి, కృష్ణబిహారీ వాజపేయి.
• గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేసిన వాజ్ పేయి
• హిందీ,ఇంగ్లీషుతో పాటుగా సంస్కృతంలోనూ పట్టు సాధించిన ఆయన రాజనీతిశాస్త్రంలో ఎం.ఎ పట్టాను కాన్పూరు లోని దయానంద ఆంగ్లో వైదిక కళాశాలనుండి పొందారు.
• 1939 లో ఆర్ఎస్ఎస్ లో చేరిన ఆయన తుదివరకు ఆ అనుబంధాన్ని కొనసాగించారు.
• 1942లో క్విట్ ఇండియా ఉధ్యమంలో పాల్గొని 23 రోజులపాటు జైలు శిక్షను అభివించారు.
• 1947 లో ఆర్.ఎస్.ఎస్. ప్రచారక్ గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు.
• 1951 లో భారతీయ జనసంఘ్ లో పనిచేయడానికి, ఆర్.ఎస్.ఎస్ దీన్ దయాళ్ ఉపాధ్యాయతో పాటు వాజపేయిని నియమించింది.
• జనసంఘ్ నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క అనుయాయిగా మరియు సహాయకునిగా మారాడు.
• 1954 లో ముఖర్జీ, కాశ్మీరులో, కాశ్మీరేతర భారతీయ సందర్శకులను చిన్నచూపు చూస్తున్నారంటూ దీనికి వ్యతిరేకంగా చేపట్టిన నిరాహరదీక్ష సమయంలో వాజ్ పేయి ఆయన వెన్నంటి ఉన్నారు.
• 1957లో వాజపేయి బల్రామ్‌ఫూర్ నియోజకవర్గం లోక్‌సభకు ఎన్నికయ్యారు.
• 1968 లో జనసంఘ్ జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు.
• దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జనసంఘ్ బాధ్యతలను తన భుజస్కందాలపైకి ఎక్కించుకున్నారు.
• 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు.
• 2వ లోక్ సభకు తొలిసారి ఎన్నికైన వాజ్ పేయి 3,9వ లోక్ సభలకు మినహాయిం 14వ లోక్ సభవరకు ప్రాతినిధ్యం వహించారు.
• రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన అటల్ బిహారీ వాజ్ పాయి.
• 1996లో ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినా 13రోజులకే లోకసభలో మెజార్టీ లోకపోవడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది.
• 1998లో రెండవ సారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పాజ్ పేయి 13 నెలలపాటు పదవిలో కొనసాగారు.
• 1999 నుండి 2004 వరకు పూర్తికాలం పదవిలో ఉన్నారు.
• పూర్తి కాలం ప్రధానిగా పనిచేసిన తొలి కాంగ్రేసేతర ప్రధానిగా వాజ్ పేయి పేరు సంపాదించుకున్నార.
• ప్రధానిగా వాజ్ పేయి పరిపాలనలో తనదైన ముద్రను వేశారు.
• అణు పరీక్షలు నిర్వహించడంతో పాటుగా దేశవ్యాప్తంగా స్వర్ణ చతుర్భుజి పేరుతో నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణంతో మౌళిక రంగాల అభివృద్ధికి పెద్దపీట వేశారు.
• అంర్జాతీయంగా అనేక ఆటుపోట్లకు సైతం ఎదుర్కొని దేశ ప్రతిష్టను నిలిపారు.
• పాకిస్థాన్ తో శాంతి చర్చలకు అహ్వానం పలికినా అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.
• కార్గిల్ లో పాకిస్థాన్ చొరబాట్లను నిలువరించిన భారత సైన్యం కార్గిల్ కదన రంగంలో పాకిస్థాన్ ను మట్టికరిపించింది వాజ్ పాయి హయాంలోనే.
• 2005 డిసెంబర్ నెలలో ముంబై లోని శివాజీ పార్కులో జరిగిన భారతీయ జనతా పార్టీ సిల్వర్ జూబ్లీ ర్యాలీలో తాను క్రియాశీల రాజకీయాల నుండి విరమిస్తున్నట్టు ప్రకటించారు.
• 2009, ఫిబ్రవరి 6న వాజపేయి ఛాతిలో ఇన్ఫెక్షన్, జ్వరం కారణంగా ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ లో చేరారు. పరిస్థితి క్షీణించడంతో వెంటిలేషన్ సహకారంతో కొన్నాళ్ళు ఉండి, ఆ తరువాత కోలుకొన్నారు.[41] అనారోగ్య కారణంగా 2009 సార్వత్రిక ఎన్నికలలో ప్రచారం చేయలేకపోయారు
• అప్పటి నుండి ప్రజాజీవితానికి దూరంగా ఉండిపోయారు.
• వాజ్ పేయి మనుషులను సరిగా గుర్తించలేకపోవడం వంటి ఇబ్బందులతో బాహ్య ప్రపంచానికి ఆయన కనిపించలేదు.
• 2014లో భారత ప్రభుత్వం వాజ్ పేయికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం “భారత రత్న” ను ప్రకటించింది.

Wanna Share it with loved ones?