మహా నేత ఆఖరి ఫొటో| Atal Bihari Vajpayee last photograph

0
76
vajpayee last photo

Atal Bihari Vajpayee last photograph … ప్రధానమంత్రిగా 2004 ఎన్నికల బరిలోకి దిగిన వాజ్ పేయి అధికారాన్ని కోల్పోయిన తరువాత పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ విపక్షనేతగా పదవిని చేపట్టలేదు. క్రమంగా రాజకీయాలకు ఆయన దూరం అవుతూ వచ్చారు. క్రియాశీల రాజకీయాల నుండి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన వాజ్ పేయి కొంత కాలం విశ్రాంతి తీసుకున్నారు. ఈ క్రమంలోనే 2009లో ఆయనకు సోకిన ఛాతీ ఇన్ఫెక్షన్ మాహనేతను ప్రజలనుండి దూరం చేసింది.
ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినడంతో ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. చలాకీగా తిరిగిన నేత చక్రాల కూర్చికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. తన అపార వాగ్ధాటితో అందరినీ అలరించిన మాటకారి మాటలు తడబడి మౌనంగానే ఉండిపోయారు. అపార జ్ఞానసంపన్నుడిగా పేరుగాంచిన వాజ్ పేయి జ్ఞాపశక్తిని కోల్పోయి మనుషులను కూడా గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నారు. 2009 నుండి వాజ్ పేయి ప్రజల మధ్యకు వచ్చింది లేదు. ఆయనకు సంబంధించిన ఫొటోలు కూడా ఎక్కడా బాహ్యప్రపంచానికి కనిపించలేదు. కొద్ది మంది సన్నిహితులు, అగ్రనేతలు మినహా వాజ్ పేయిని ప్రత్యక్షంగా చూసిన వాళ్లే లేరు. మీడియా కళ్లకు కనిపించకుండా ఉండిపోయిన మహానేతను అడపాదడపా కొందరు నేతలు మాత్రమే పలకరిస్తూ వచ్చారు.
ప్రజలే జీవితంగా ప్రజల మధ్యే తన జీవితంలో అధికశాతం గడిపిన వాజ్ పేయి చివరిరోజుల్లో మాత్రం ప్రజలకు దూరంగా పూర్తిగా ఏకాంతంగా గడిపారు. కొద్ది మందికి మినహా ఆయనను చూసే భాగ్యం ఎవరికీ కలగలేదు. వాజే పేయిని కలిసేందుకు వచ్చిన ఆయన అభిమానులు ఇంటి ముందు ఫొటోలు తీయించుకుని వెనుదిరగాల్సిన పరిస్థితి.

వాజ్ పేయి 85వ జన్మదినోత్సవం సందర్భంగా 2009లో ఆయన్ను కలిసేందుకు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వచ్చిన సందర్భంగా ఒక ఫొటో బయటికి వచ్చింది. అప్పట్లో పీటీఐ ఈ ఫొటోను విడుదల చేసింది. అందులోనూ వాజ్ పేయి నీరసంగా కనిపించారు.

2009 నుండి 2015 వరకు వాజ్ పేయి కి సంబంధించిన ఫొటోలు ఏవీ బాహ్యప్రపంచానికి కనిపించలేదు. భారత్న అవార్డును అందించే సమయంలో మాత్రం ఒక ఫొటోను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది. ఇందులో కూడా వాజ్ పేయి పాక్షికంగా కనిపించారు తప్ప ఆయనకు సంబంధించిన పూర్తి చిత్రం ఏదీ విడుదల కాలేదు. భారత రత్న అవార్డును తీసుకునేందుకు వాజ్ పేయి రాష్ట్రపతి భవన్ కు వచ్చే అవకాశం లేకపోవడంతో నాటి రాష్ట్రపతి స్వయంగా వాజ్ పేయి నివాసానికి వచ్చి అవార్డును బహూకరించారు. నిరాండబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో అత్యంత ప్రముఖులైన కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం అందింది. కుర్చీలో కూర్చొని ఉన్న వాజ్ పేయి కి ప్రణభ్ ముఖర్చీ అవార్డును ఇస్తున్న ఫొటోను అధికారికంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మీడియాను అహ్వానించకపోవడంతో రాష్ట్రపతి భవన్ వర్గాలు మాత్రమే ఒక ఫొటోను విడుదల చేసింది. ఇందులో కూడా వాజ్ పేయి ముఖం స్పష్టంగా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రపతి నిల్చుని అవార్డును ఇస్తుండగా వాజ్ పేయి కూర్చిని ఉండడాన్ని బట్టి ఆయన నిల్చునే స్థితిలోలేరనే విషయం అర్థం అయింది.
వాజ్ పేయి లాంటి మాహనేత ఆఖరి రోజుల్లో చిత్రాలు బయటికి రాకపోవడమే మంచిదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చలాకీగా ఉండే తమ నేత చక్రాల కుర్చీకే పరిమితం కావడాన్ని తాము జీర్ణించుకోలేమని తమ మదిలో ఆయన చిరునవ్వుతో కూడిన మోమునే పదిలపర్చుకుంటామని అంటున్నారు.
Atal Bihari Vajpayee last photograph.

కేరళలో వరద బీభత్సం


రాజ్ ఘాట్ సమీపంలో వాజ్ పేయి అంత్యక్రియలు

Wanna Share it with loved ones?