ఎయిమ్స్ కు తరలివస్తున్న నేతలు

0
56
అటల్ బిహారీ వాజ్ పేయి

భారత మాజీ ప్రధాని, “భారత రత్న” అటల్ బిహారీ వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిపై వార్తలు వెలువడినప్పటి నుండి పెద్ద సంఖ్యలో నేతలు ఎయిమ్స్ కు తరలివచ్చారు. వాజ్ పేయి ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ఆలిండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వర్గాలు ఉదయం వెల్లడించినప్పటి నుండి ప్రధానితో సహా అన్ని పార్టీల నేతలు తరలివచ్చారు.
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ సీనియర్ నేత, వాజ్ పేయి సహచరుడు ఎల్.కే.అధ్వానీ, కేంద్ర విదేశీ వ్యవహార శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ తో పాటుగా పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నేతలు ఎయిమ్స్ కు వచ్చి వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు.
గ్వాలియర్, ఆగ్రాలలో ఉన్న వాజ్ పేయి బంధువులు కూడా ఎయిమ్స్ కు చేరుకున్నారు. వాజ్ పేయి కొద్ది సంవత్సరాలుగా ఇంటికే పరిమితం అయ్యారు. మతిమరుతు ఇతరత్రా ఆనారోగ్య సమస్యల వల్ల ఆయన ప్రజాజీవితానికి చాలా రోజులుగా దూరంగా ఉంటున్నారు. అడపాదడపా బీజేపీ అగ్రనేతలు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాంటి కొంత మంది మినహా వాజ్ పాయిని కలిసే అవకాశం ఎవరికీ ఇవ్వడం లేదు. భారత రత్న అవార్డును సైతం ఆయన నివాసానికే వెళ్లి ఇవ్వాల్సి వచ్చింది. భారత దేశం గర్వించదగ్గ అరుదైన నేత ఆరోగ్యం మెరుగుపడాలంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
Atal Bihari Vajpayee , Prime Minister of India,Lucknow,Janata government.

వాడవాడలా ఎగిరిన మువ్వన్నేల జెండా


దేశానికే ఆదర్శం – తెలంగాణ రాష్ట్రం

Wanna Share it with loved ones?