ఘనంగా ఆటా కెంటక్కీ ఉత్సవాలు

అమెరికాలోని కెంటక్కీ రాష్ట్రం ల్యూజ్ విల్ పట్టణంలో జరిగిన ఆటా ఉత్సవాలు అచ్చతెనుగు వెలుగులను విరజిమ్మాయి. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) నిర్వహించింది. పట్టణంలోని శ్రీ స్వామినారాయణ ఆలయంలో జరిగిన ఈ వేడుకలను పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు హాజరయ్యారు.
తెలుగు వారి పండుగలు, సాహిత్యం, సంస్కృతిని ప్రతిబింస్తూ జరిగిన కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. తెలుగు వారితో పాటుగా తెలుగు రానివారినిసైతం ఈ కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. స్థానికంగా నివసించే తెలుగు వారితో పాటుగు భారత్ లోని ఇతర ప్రాంతాలకు చెందినవారు సైతం కార్యక్రమానికి రావడం విశేషం.
దాదాపుగా 650 మందికి పైగా హాజరైన ఆటా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆహుతులను విశేషంగా ఆకర్షించాయి. ప్రముఖ సినీ నేపధ్య గాయకులు సునిత, దినకర్ లు ఆలపించిన గేయాలు అందరినీ అలరించాయి. మేమేం తక్కువకాదంటూ అమెరికాలోని తెలుగు వారు సైతం తమ కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
మాతృభూమికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా తమకు మాతృభుమిపై కానీ మాతృభాష పై కానీ మమకారం ఏమాత్రం తగ్గలేదని అమెరికాలో ఉంటున్న తెలుగు వారు మరోసారి నిరూపించారు. తెలుగు భాష పై మక్కువ చూపిస్తూ తెలుగు సాంస్కృతిక సౌరభాలను వెదజల్లారు. తమ ప్రదర్శనల ద్వారా అందర్నీ మైమరిపించి తెలుగు నేలను మరోసారి అందరికీ గుర్తుచేశారు.
ఆటా బైలాస్ చేర్ యెర్రంరెడ్డి తిరుపతి రెడ్డి, వెబ్ కొ-చేర్ కోటగిరి శ్రీకాంత్, కెంటక్కీ రీజినల్ కొఆర్డినేటర్ గుండ్లూరు మహేష్, ‘ఆటా కోర్ టీం’ బృందం సభ్యులు తుటుపల్లి సరస్వతి, గుండ్లూరు కవిత, సద్దాల కవిత-హేంప్రసాద్, గంటేటి అనీల్ కుమార్-రమ్య, బుస్సు వెంకటేశ్వర్ రెడ్డి-సరిత, కటంగూరి రాజగోపాల్ రెడ్డి-కవిత, యెర్రంరెడ్డి జ్యోతి, కొండవీటి బాబు, మనుకొండ సురేష్, సొంటనం రమేష్, మాల్నేని రమేష్, డా పల్లి సుబ్బా రెడ్డి, అల్లూరి రాజు, డాll పల్లా మురళి, డా. ఘంటా రమేష్, డా. శ్రీ రాపూరి, డా. కొడాలి సురేష్క్ష్, అలమంద కృష్ణ-భారతి, బోయ శివరామకృష్ణ కోటి రెడ్డి, కాకులమర్రి సుజిత మరియు తదితర ప్రాంతీయ-జాతీయ స్థాయిల్లోని ‘ఆటా’ కార్యనిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు ఆసిరెడ్డి కరుణాకర్ రెడ్డి, ‘ఆటా’ బోర్డు ట్రస్టీ బోదిరెడ్డి అనీల్, వెబ్ కమిటీ చేర్ ముత్యాల ఉమేశ్, కమ్యూనిటీ చేర్ ఆల రామకృష్ణారెడ్డి, పిఆర్ చేర్ సుధా రెడ్డి, నాష్ల్ విల్లీ రీజినల్ కొఆర్డినేటర్ నూకల నరేందర్ రెడ్డి, స్టాండింగ్ కమిటీ కో-చేర్ గూడూరు కిషోర్ రెడ్డి మరియు తదితర లూజ్-విల్, లెక్సింగ్టన్, ఫ్రాంక్ ఫర్ట్, కెంటక్కీ ప్రాంతీయ ఆటా టీం ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన నిర్వహకులను పేరుపేరును ఆహుతులు కొనియాడారు. తెలుగు భాషా వికాసానికి అమెరికాతో పాటుగా మాతృదేశంలోనూ కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారిని అభినందించారు. తెలుగు భాష, సంస్కృతిపై మక్కువతో నిర్వహిస్తున్న కార్యక్రమాల పట్ల ఆనందం వ్యక్తం చేశారు.


dignity-of-labour/
American_Telugu_Association