తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుండి 50 రోజుల పాటు జరగనున్నాయి. వర్షకాల, సీతాకాల సమావేశాలను ఈ దఫా 50 రోజులపాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. శుక్రవారం నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10.00 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రతీ శని, ఆదివారం సమావేశాలను నిర్వహించడం లేదు. ప్రధాని తెలంగాణలో ప్రయటించే సమయంలోనూ సమావేశాలు జరగవు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తర సమయాన్ని మరో అరగంట పెంచాలని అధికార పక్షం నిర్ణయించింది. కనీసం పది ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఉవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శాసన సభలో అనుసరించాల్సిన వ్యూహంపై అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. సమావేశాలు జరిగినన్ని రోజులు మంత్రులు అండుబాటులో ఉంటాలని విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు సబ్జెట్ పై పూర్తి అవగాహానతో సిద్ధపడి రావాలని సీఎం మంత్రులను ఆదేశించారు.
అటు విపక్షాలు కూడా అసెంబ్లీ సమావేశాల వేదికకము ప్రభుత్వాన్ని ఎండగట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విపక్ష కాంగ్రెస్ తోపాటు టీడీపీ, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యమంత్రి అంతా బాగుందని చెప్తున్నారు తప్ప సమస్యల పరిష్కారంలో ఎటువంటి శ్రద్ద చూపడంలేదనేది విపక్షాల వాదన.
అటు టీడీపీ ఈ సమావేశాల్లో విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. శాసనసభా పక్ష నేతగా రేవంత్ రెడ్డిని ఆపార్టీ తొలగించినప్పటికీ ఇప్పటికీ ఆ పార్టీలోనే ఉన్న రేవంత్ టీడీఎల్పీ సమావేశానికి సైతం హాజరయ్యారు. పార్టీ తరపున గట్టిగా గొంతు విప్పే రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ బాణీని వినిపించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపధ్యంలో అసెంబ్లీ వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.