మంత్రుల రాజీనామా…

కేంద్ర మంత్రివర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు అశోక గజపతి రాజు, సుజనా చౌౌదరిలు రాజీనామా చేశారు.పార్టీ ఆదేశాల ప్రకారం తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి రాజీనామాలు సమర్పించిన తరువాత వారు మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గంలో కలిసి పనిచేసేందుకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్రమోడికి కృతజ్ఞతలు తెలిపినట్టు వారు చెప్పారు. రాజీనామా నిర్ణయాన్ని చెప్పిన తరువాత ప్రధాని తమను పిలిచి మాట్లాడారని అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారం రాజీనామా చేశామని మంత్రలు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకంటే తమకు మంత్రిపదవులు ముఖ్యం కాదన్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించేంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని మంత్రులు స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను మోసం చేస్తే బీజేపీ ఇప్పుడు నమ్మక ద్రోహం చేసిందని దొందూ దొందేనని అన్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ కూడా సరిగా అమలు పర్చలేదని సుజనా చౌజరి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ను కేంద్ర ప్రభుత్వం దారుణంగా మోసంచేసిందనే భావన ప్రజల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. వాస్తవాన్ని గుర్తించకుండా కేంద్ర ప్రభుత్వం ఇంకా కాలయాపన చేయడం సరికాదన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న ఏపీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉందని దీన్ని సక్రమంగా నిర్వహించలేదన్నారు.
Ministers Ashok Gajapathi Raju and Y.S. Chowdary resigns from the central cabinet. central Minister for Civil Aviation mr. Ashok Gajapathi Raju and Minister of State for Science and technology mr. Y.S. Chowdary submitted their resignations to Prime Minister mr. Narendra Modi


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *