వీహెచ్ పై మండిపడుతున్న అంజన్ కుమార్ యాదవ్

సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేస్తానంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ క్రికెటర్ అజాహరుద్దీన్ చేసిన ప్రకటన వెనుక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు ఉన్నాడని మాజీ ఎంపీ అంజన్ కుమార్ వర్గం ఆరోపిస్తోంది. గడ మూడు సార్లుగా సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థానం నుండి అంజన్ కుమార్ యాదవ్ పోటీచేస్తున్నారు. ఇందులో రెండు సార్లు ఆయన గెలుపొందగా గత ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ చేతిలో ఓటమి చవిచూశారు. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే ఖాయమని అంజన్ కుమార్ యాదవ్ భావిస్తున్న తరుణంలో హఠాత్తుగా తెరపైకి వచ్చిన అజహారుద్దీన్ తాను సికింద్రాబాద్ పార్లమెంటరీ స్థానం నుండి పోటీచేయాలనే ఆసక్తి చూపుతున్నట్టు ప్రకటించడం సంచలనం రేపింది.
అజాహరుద్దీన్ ప్రకటనపై అంజన్ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు ఎన్నికల్లో పోటీచేయడానికి సిద్దంగా ఉన్నాడని నియోజకవర్గ ప్రకజలతో సన్నిహిత సంబంధాలున్న తన నేతను కాదని తాను పోటీచేస్తానంటూ అజహరుద్దీన్ ప్రకటించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక పథకం ప్రకారం తమ నేతను దెబ్బతీసేందుకే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. అజాహరుద్దున్ ను తెరపైకి తీసుకునిరావడం వెనుక కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు హస్తం ఉందని వారు బాహాటంగా విమర్శిస్తున్నారు. అంజన్ కుమార్ యాదవ్ కు ఇటీవల గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవి రావడంతో దాన్ని జీర్ణించుకోలేకపోతున్న వీహెచ్ ఇటువంటి ప్రకటనలు చేయిస్తున్నారని వారంటున్నారు.
వీహెచ్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా కొంత మంది తమపార్టీకి చెందిన నేతలే అజాహరుద్దీన్ తో ప్రకటన చేయించారని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున తానే పోటీచేస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో విభేదాలు సృష్టిస్తున్న నేతలపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన చెప్పారు.
ఇటు గాంధీభవన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశం రాసాభాసగా ముగిసింది. అజాహరుద్దీన్ ప్రకటనపై అంజన్ కుమార్ యాదవ్ తో పాటుగా ఆయన వర్గీయులు నిలదీశారు. దీనితో సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. ఏఐసీసీ ఇంఛార్జి బోస్‌ రాజు ముందే ఈ తతంగం అంతా జరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ అంజన్ కుమార్ యాదవ్ కు సర్థిచెప్పేప్రయత్నం చేశారు. దీనిపై అంజన్ కుమార్ మాట్లాడుతుండగానే వీహెచ్ సమావేశం నుండి లేచి వెళ్లిపోయారు.
ఇప్పటికే హైదరాబాద్ లో బలమైన నేతగా పేరుపొందిన దానం నాగేందర్ పార్టీకి గుడ్ బై చెప్పాగా మరికొంత మంది నేతలు అదే బాటులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మాజీ మంత్రి ముకేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీకి రాంరాం చేప్తారనే ప్రజారం జరుగుతుండగా ఈరోజు జరిగిన సమావేశానికి ఆయన రాకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతుంది. ఇటు పార్టీలో అంతర్గత కుమ్ముటాలు పార్టీ అధిష్టానానికి మరింత తలనొప్పిగా మారింది.
congress, telangana congress, telangana congress committee,tpcc, anjan kumar yadav, anjan kumar, v.h.hanumatha rao, uttamkumar reddy, congress party, telangana, azaruddin, secunderabad, hyderabad.


Secunderabad_(Lok_Sabha_constituency)