2029 నాటికి దేశంలోనే అగ్ర రాష్ట్రంగా ఏపీ : నారా చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 72 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుండి ప్రతీ సంవత్సరం ఒక్కో జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో శ్రీకాకుళంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

• 2029 నాటికి దేశంలోనే అగ్ర రాష్ట్రంగా ఏపీ నిలబడాలి, ఆదిశగా అహర్నిశలు పనిచేస్తున్నాం.

• విభజనతో నష్టపోయినా అభివృద్ధి ఆగకుండా చూశాం.

• ఎన్ని అవరోధాలు ఎదురైనా లక్ష్యం దిశగా సాగుతున్నాం.

• నాలుగేళ్లలో రెండంకెల అభివృద్ధి సాధించాం.

• ఆనంద ఆంధ్రప్రదేశ్‌ దిశగా ప్రభుత్వ అడుగులు వేస్తోంది’

• రైతులకు రూ.24,500 కోట్ల రుణవిముక్తి చేశాం.

• రాష్ట్రంలో అందరూ ఆనందంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

• ఆర్ధిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం.

• వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టి వరి దిగుబడులు పెంచాం.

• . సంకల్ప బలం ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించగలం.

• శ్రీకాకుళం జిల్లా ఎందరో గొప్పనేతలకు నిలయం

• ఎందరో మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్య్రం

వాడవాడలా ఎగిరిన మువ్వన్నేల జెండా