చట్టప్రకారమే నడుచుకుంటా:ప్రదీప్

డిసెంబర్ 31వ తేదీన మందుకొట్టి పోలీసులకు చిక్కిన ప్రముఖ యాంకర్ ప్రదీప్ మీడియాకు ఒక వీడియోను పంపాడు. తాను చేసింది తప్పేనని చట్ట ప్రకారం నడుచుకుంటానని చెప్పాడు. తాను ఎక్కడికీ పారిపోలేదని ముందుగు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొన్ని షూటింగ్ లు ఉండడంతో వాటిల్లో బిజీగా ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. విపరీతంగా ఫోన్లు రావడం వల్ల తాను కొన్ని ఫోన్ లను అటెండ్ కాలేకపోయానని అందువల్లే తాను తప్పించుకుని తిరుగుతున్నట్టు అంతా అనుకున్నారని చెప్పాడు. పోలీసుల కౌన్సిలింగ్ హజరవుతానని చట్టప్రకారం నడుచుకుంటానని అన్నాడు.