ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ రు.1399కే స్మార్ట్ ఫోన్

టెలికాం మార్కెట్ లో సంచలనం రేపుతున్న జియో నుండి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ఎయిర్ టెల్ వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. జియోకు పోటీగా రు.1399 కే స్మార్ట్ ఫోన్ ను వినియోగదారులకు అందచేస్తున్నట్టు టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ ప్రకటించింది. ‘మేరా పెహ్లా 4జీ స్మార్ట్‌ఫోన్‌’ పేరిట ఎయిర్ టెల్ ఈ భారీ ఆఫర్ ను వినియోగదారులకు అందచేస్తోంది. కార్బన్ మొబైల్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎయిర్ టెల్ రు.2899 కే ఏ40 మొబైల్ ను విక్రయిస్తోంది. దీని మార్కెట్ ధర రు.3499 కాగా ఎయిర్ టెల్ దాన్ని రు.2899కే తమ వినియోగ దారులకు విక్రయిస్తోంది. ఇందులో రు.1500 లను ఎయిర్ టెల్ మూడేళ్ల తరువాత తిరిగి వాసప్ చేయనుంది అంటే వినియోగదారుడికి ఈపోన్ రు.1399 కే వచ్చినట్టని ఎయిర్ టెల్ ప్రకటించింది. క్యాష్ బ్యాక్ ను పొందడానికి వినియోగ దారుడు 18 నెలల్లో కనీసం రు.3వేల రీఛార్జీ చేయాల్సి ఉంటుందని ఎయిర్ టెల్ షరతు విధించింది. 18 నెలల తరువాత తొలి విడతగా రు.500 ని వాపస్ చేస్తారు. ఆ తరువాత మరో 18 నెలల్లో కనీసం మూడు వేల రూపాయలకు రీఛార్జీ చేయిస్తే మిగిలిన వేయి రూపాయలను వినియోగదారుడికి అందచేస్తారు. మూడేళ్ల తర్వాత ఫోన్ వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని ఎయిర్ టెల్ ప్రకటించింది.
ఈ ప్రత్యేక స్మార్ట్ ఫోన్ కోసం ఎయిర్ టెల్ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. నెలకు రూ.169 రీఛార్జిపై అపరిమిత కాల్స్‌తో పాటు, రోజుకు 500 ఎంబీ డేటాను వినియోగాదురుడు పొంందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *