ఉట్నార్,ఆదిలాబాద్ లలో బంద్-పరిస్థితి ప్రశాంతం

ఆందోళనలతో అట్టుడికిన ఉట్నూరు, ఆదిలాబాద్ ఎజెన్సీ ప్రాంతాల్లో వివిధ సంస్థలు బంద్ కు పిలుపునివ్వడంతో జనజీవనం స్థంబించింది. వాహనాలు రోడ్లపై పల్చబడ్డాయి. దుకాణాలు, విద్యాసంస్థలు,కార్యాలయాలు పనిచేయడం లేదు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించాయి. రాపిడ్ యాక్షన్ బలగాలు రంగాలోకి దిగాయి. పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న అబద్దపు వార్తలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. తమ వర్గంపై దాడులు జరుగుతున్నాయంటూ జరుగుతున్న ప్రచారం ఉధ్రిక్తతలను పెంచి పోషిస్తోంది. వదంతులను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఉట్నూరు తో పాటుగా పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.