ఒక్క ముద్దే కదా ఇచ్చేయ్-అదా శర్మ పై దారుణ కామెంట్లు

సినీ నటి అదా శర్మ వ్యవహారంలో నెటిజన్ల తీరు అభ్యంతరకరంగా ఉంది. ఒక ముద్దే కదా ఇచ్చేయ్… అంటూ చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా దారుణం. అసలు దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ముంబాయి ఎయిర్ పోర్టులో తనకు తారసపడిన అదా శర్మను కలిసిన ఒక వ్యక్తి తనకు ముద్దు ఇవ్వాలంటూ వెంటపడ్డాడు. అక్కడి నుండి అమె వేగంగా వెళ్లిపోవడంతో సినిమాల్లో ముద్దులు ఇస్తావ్ నాక్కూడా ఇవ్వచ్చు కదా అంటూ గట్టిగా కేకలు వేశాడు. ఈ తతంగాన్ని వీడియో తీసిన కొందరు దాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. చాల మంది అదా శర్మకు మద్దతుగా మాట్లాడితే కొందరు చేసిన కామెంట్లు మాత్రం దారుణంగా ఉన్నాయి. సినిమాల్లో ముద్దు సీన్లలో నటించే అదా శర్మ ఆ వ్యక్తికి ముద్దిస్తే తప్పేంటని చేసిన వ్యాఖ్యానిచడాన్ని చూస్తుంటే కొంత మంది మైండ్ సెట్ ఏంత దారుణంగా ఉందో తెలుస్తోంది.
సినిమా వాళ్లకి వ్యతిగత జీవితాలు , ఇష్టాయిష్టాలు ఉండవా… ఎవరికి పడేతే వారికి ఎక్కడ పడితే అక్కడ ముద్దులు ఇవ్వడమే వారి పనా… సినిమాల్లో చేసిన పనులన్ని నిజజీవితంలోనూ చేయాలా… ఎయిర్ పోర్టులో ఎవడో మతిమాలిన వ్యక్తి చేసిన పనికి మద్దతుగా నిల్చిన వారిని ఏమనాలి? చదువుకుని సమాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్న ఈ మేధావులు ఎటువంటి సందేశం ఇవ్వదల్చుకున్నారో తెలియడం లేదు. సినీ నటి పై అభ్యంతరకరంగా వ్యవహరించిన వాడికి మద్దతు ఇస్తూ చిన్న ముద్దే కదా ఇచ్చేయ్ అంటూ వెకిలి వ్యాఖ్యలు చేసే పెద్ద మనుషుల తీరు గర్హనీయం.అదా శర్మ సినిమాల్లో ఎన్నో ముద్దు సీన్లలో నటించి ఉండవచ్చు కానీ అమెను ఆమెతో ఆవిదంగా వ్యవహరించడం మాత్రం ముమ్మాటికీ తప్పే.
మరో వైపు తన సినిమాల్లో హాట్ హాట్ గా నటించిన అదా శర్మ సమాజంపై తన నటన ప్రభావం ఏ మేరకు ఉందో ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. అందాల ఆరబోతకు అభ్యంతరం చెప్పకుండా నటించిన ఈ బామ సగటు ప్రేక్షకుడి మదిలో ఈ దృశ్యాల ప్రబావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకోవాలి.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *