అన్నిటికీ ఆధార్ అవసరం లేదా..?-సుప్రీం కీలక తీర్పు

వ్యక్తిగత గోప్యత పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం ఏమిటనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పథకాలు మొదలు టెలిఫోన్ కనెక్షన్ దాకా ప్రతీ దానికీ ఆధార్ కార్డును సమర్పించాల్సిందేననే నిబంధనకు ఈ తీర్పు తో బ్రేక్ పడే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు. వ్యక్తిగత గోపత్య ప్రాథమిక హక్కేనంటూ అత్యన్నత న్యాయస్థానం తెల్చి చెప్పడంతో ఆధార్ తో అనుసంధానాలకు బ్రేక్ పడవచ్చు. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుగా తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తెల్చిచెప్పింది. ప్రభుత్వ పథకాలకు ఆధార్ ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొంత మంది సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ ను విచారించే క్రమంలో సుప్రీం కోర్టు ముందుగా వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హాక్కా కాదా అనేది తేల్చడానికి తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.
గతంలో వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు విరుద్ద అభిప్రాయలను వ్యక్తం చేసింది తాజాగా చీఫ్‌ జస్టిస్‌ ఖేహర్‌తో పాటు.. న్యాయమూర్తులు జాస్తి చలమేశ్వర్‌, ఎస్‌ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్‌, ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, ఆర్‌కే అగర్వాల్‌, రోహిన్‌టన్‌ ఫాలీ నారీమన్‌, అభర్‌ మనోహర్‌ సాప్రే, సంజయ్‌ కిషన్‌ కౌల్‌ లతో కూడా రాజ్యాంగ ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పులను కొట్టివేస్తూ వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుగా తెల్చిచెప్తూ తీర్పు నిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *