రాహుల్ వి పగటి కలలు :అమిత్ షా

0
77

రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ యువజన మోర్చ మహా సమ్మేళన ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మజ్లీస్ కు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదని అన్నారు. మజ్లీస్ తో అంటకాగుతున్న టీఆర్ఎస్ కు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకునే దమ్ములేకుండా పోయిందన్నారు. తాను ప్రధాని మంత్రిని అయిపోయినట్టు రాహుల్ గాంధీ పగటి కలలు కంటున్నారని తన కూటమికే నాయకత్వం వహించలేని రాహుల్ దేశానికి ఏ విధంగా నాయకత్వం వహిస్తారని అమిత్ షా ప్రశ్నించారు.
గతంలో ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి యధేచ్చగా దాడులు జరిపే పరిస్థితి ఉండేదని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. ఉగ్రవాదుల శిభిరాలల్లోకి దూసుకుని పోయిన మన సైన్యం వారిని మట్టుపెట్టిందని సర్జికల్ దాడుల తరువాత పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయన్నారు. గతంలో ఈ తరహా దాడుల గురించి ప్రపంచంలో ఎక్కడ ప్రస్తావన వచ్చినా ఇజ్రాయిల్, అమెరికా లను గురించి మాత్రమే మాట్లాడుకునే వారని ఇప్పుడు భారత్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ఉగ్రవాదుల పట్ల మన్మోహన్ సర్కారు ఉదాశీనంగా వ్యవహరించిందని అన్నారు.
మోడి సర్కారు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను గురించి ప్రతీ యూవజన కార్యకర్త ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రస్తుతం భారత్ అభివృద్ది పథంలో దూసుకుని పోతోందని గతంలో నిర్లక్ష్యం చేసిన అనేక రంగాలు ఇప్పుడు కొత్త కాంతులను సంతరించుకుంటున్నాయని అన్నారు. మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారా భారత్ ను ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చేందుకు మోడీ సర్కారు ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. స్వచ్చమైన పరిపాలనను మోడి సర్కారు అందిస్తుంటే దాన్ని చూసి ఓర్వలేనితనంతో విపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయని అమిత్ షా మండిపడ్డారు.
ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తిరిగి కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని గత ప్రభుత్వాలకు, బీజేపీ ప్రభుత్వానికి ఉన్న తేడాను దేశ ప్రజలు గుర్తించారని అందుకే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీని అందలం ఎక్కిస్తున్నారని అన్నారు.

Wanna Share it with loved ones?