అగ్ని-5 పరీక్ష విజయవంతం-అగ్రదేశాల సరసన భారత్

ఖండాతంర క్షిపణి అగ్ని-5 ప్రయోగం విజయవంతం అయింది. దీనితో ఖండాంతర క్షిపణులు కలిగి ఉన్న దేశల జాబితాలోకి భారత్ కూడా చేరిపోయింది. ప్రస్తుతం అమెరికా,రష్యా,ప్రాన్స్,ఇంగ్లాండ్,చైనా వద్ద మాత్రమే ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. వాటి సరసన భారత్ చేరింది. అగ్ని-5 విజయంతో భారత అమ్ముల పొదిలో మరో అత్యాధునిక కీలకమైన ఆయుధం చేరినట్టయింది. అగ్ని 1500కిలోల  అణ్వాయుధాలను 5800 కిలో మీటర్లు మోసుకుని పోగలదు. పాకిస్థాన్ తో పాటుగా చైనాలోని చాలా  ప్రాంతాలు అగ్ని పరిథిలోకి వచ్చాయి. అగ్ని-5 ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఆసియాతో పాటుగా ఆఫ్రికా, ఐరోపాలోని పలు ప్రాంతాలు అగ్ని-5 రేంజ్ లోకి వచ్చాయి. అగ్ని-5 విజయవంతం కావడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *