దాణా కుంభకోణంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లలూ ప్రసాద్ యాదవ్ కు ముడున్నర సంవత్సరాల జైలు శిక్ష పడింది. దీనితో పాటుగా 5లక్షల జరిమానాను కూడా కోర్టు విధించింది. రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ తీర్పును వెలువరించింది. 21ఏళ్ల క్రితానికి చెందిన ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటుగా మరో 15 మందిని కోర్టు దోషులుగా తేల్చింది. 1991-94 మధ్య దేవ్‌గఢ్‌ ఖజానా నుంచి రూ.89.27లక్షల మొత్తాన్ని తప్పుడు వివరాలతో కాజేయడానికి సంబంధించిన కేసులో సీబీఐ విచారణ జరిపి 38 మందిపై అభియోగపత్రాలు నమోదు చేసింది. ఇందులో ఇద్దరు అప్రూవర్లుగా మారడంతో వారికి శిక్షలు ఇప్పడికే పడిపోగా 11 మంది విచారణ జరుగుతుండగానే మరణించారు.