మొబైల్ ఫోన్ల సర్వీస్ ప్రొవైడర్లు ఉచిత ఆఫర్లతో మార్కెట్ ను మంచెత్తుతున్నారు. ఇప్పటికే 4జీ మొబైల్ డేటాను ఉచితంగా పొందవచ్చని ప్రకటించి జీయో సంచలనం రేపగా తాజాగా టెలికాం దిగ్గజ సంస్థ సంవత్సరం పాటు ఉచిత 4జీ సేవలను అందచేసేందుకు సిద్దమయింది.
- తమ 4జీ నెట్‌వర్క్‌లోకి మారే కస్టమర్లకు కొత్త ఏడాదంతా ఉచిత డేటా అందించనున్నట్టు ఏయిర్ టెల్ ప్రకటించింది.
- 4జీ మొబైల్ హ్యాండ్సెట్ కస్టమర్లందరికీ ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది
- ఈ ఆఫర్ కింద ఎంపికచేసిన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్యాక్స్నూ ఈ కొత్త ఏడాది డిసెంబర్ చివరి వరకు ప్రతి నెలా 3జీబీ డేటాను ఉచితంగా ఎయిర్టెల్ అందించనుంది.
- కంపెనీ ప్యాక్ ప్రయోజనాలకు ఈ ఉచిత డేటా తక్కువగా లేదా ఎక్కువగానూ ఉండొచ్చని కంపెనీ పేర్కొంది.
- ఫిబ్రవరి 28లోపల ఎయిర్‌టెల్‌లోకి మారే కస్టమర్లకు ఈ ఆఫర్ అందించనుందని వెల్లడించింది.
- జనవరి 4వ తేదీ నుండి ఆఫర్ అందుబాటులోకి వస్తోంది. ఫిబ్రవరి 28తో ఈ ఆఫర్ గడువు ముగియనుంది.
- కొత్త 4జీ హ్యాండ్సెట్లోకి అప్‌గ్రేడ్ అయ్యే ప్రస్తుత ఎయిర్టెల్ కస్టమర్లకూ ఇది వర్తించనుంది.