బంగారు తెలంగాణనే మన ధ్యేయం:కేటీఆర్

బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్పీ పనిచేయాలని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలపునిచ్చారు. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్పీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉధ్యమ సమయంలో టీఆర్ఎస్వీ చేసిన పోరాటాన్ని ఎవరూ మర్చిపోలేరన్నారు. సుశిక్షిత సైన్యం లాగా తెలంగాణ ఉధ్యమంలో తన శక్తిని చాటిన టీఆర్ఎస్పీ ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించాలన్నారు. జ్ఞానం కోసం చదువుకోవాలని ఆ జ్ఞానాన్ని ప్రజలకోసం వినియోగించాలని కేటీఆర్ అన్నారు. రాబోయే కాలంలో నాయకత్వం వహించేది టీఆర్ఎస్పీ నాయకులే అన్నారు. పోరాడి సంపాదించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో ముందుజంలో నిలపాలన్నారు.
తెలంగాణ ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల రాలేదని అది తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణను తాము ఇచ్చినట్టుగా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ఉధ్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తామే ఇచ్చామన్నాట్టు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే వీపు చింతపండు అవుతుందనే భయంతోనే తెలంగాణను ఇచ్చారు తప్ప మరొకటి కాదన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని బలవంతంగా ఆంధ్రాతో కలిపిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాకుండా అడ్డుకుని ఉధ్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్దిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ది చేసీ తీరుతామన్నారు. తెలంగాణ వచ్చిన మూడు సంవత్సరాల్లో జరిగిన అభివృద్దిని చూసి ఓర్చుకోలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ అభివృద్దికి ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రస్తుతం తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మొదటి శత్రువుగా మారిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *