మోడీకి ఇజ్రాయిల్ లో ఘన స్వాగతం

ప్రధాని నరేంద్ర మోడీ చారిత్రాత్మక ఇజ్రాయిల్ పర్యటన మొదలైంది. రాజధాని టెల్ అవీవ్ కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఆదేశ ప్రధాని నెత్యాహు ఎదురేగి స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడితో సమానంగా భారత ప్రధానికి ఇజ్రాయిల్ లో ఘన స్వాగతం లభించింది. మోడి వచ్చిన వెంటనే ” ఆప్ కా స్వాగత్ హై మేరా దోస్త్” అంటూ హిందిలో ఇజ్రాయిల్ ప్రధాని నేత్యాహు భారత ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకడం విశేషం. మోడీ పర్యటనకు ఇజ్రాయిలీ ప్రభుత్వం అత్యంత ప్రధాన్యం ఇస్తోంది. ఇప్పటివరకు భారత ప్రధాని ఎవరూ ఇజ్రాయిల్ లో పర్యటించలేదు. భారత్ -ఇజ్రాయిల్ సంబంధాలు ఈ పర్యటనతో కొత్త పుంతలు తొక్కుతాయని భావిస్తున్నారు. అరబ్బు దేశాలతో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని భారత్ గతంలో ఎన్నడూ ఇజ్రాయిల్ తో పూర్తి స్థాయి సంబంధాలు పెట్టుకోలేదు. మొట్టమొదటి సారిగా 1992లో నాటి ప్రధాని పి.వి.నరసింహారావు హయంలో ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు మొదలయ్యాయి.
ఇస్లాం తీవ్ర వాదం ఇరు దేశాలకు అత్యంత ప్రధాన సమస్యగా ఉన్న నేపధ్యంలో భారత్-ఇజ్రాయిల్ లు అనేక అంశాల్లో కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నాయి. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా కొత్త ఒప్పందాలు కుదరవచ్చనే ఆశభావంతో ఇరుదేశాలు ఉన్నాయి. ఇప్పటికే రష్యా,అమెరికా తరువాత ఇజ్రాయిల్ భారత్ కు అతిపెద్ద ఆయుధ విక్రేతగా ఉంది.
Photo courtesy: ANI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *