ఈ ఫొటోలు ఉన్నది ఎవరో గుర్తు పట్టారా…!

‘క్యూంకీ సాస్‌ భీ కభి బహూ థీ’ భారతీయ బుల్లితెరను ఒక ఊపు ఊపిన సీరియల్. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ సీరియల్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. పెద్ద సంఖ్యలో టీవీలకు అతుక్కుపోయేట్టు చేసిన ఈ సీరియల్ లో తులసి విరానీ పాత్రను పోషించిన స్మృతి ఇరానీ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న స్మృతీ ఇరానీ నీ ఇంకా ప్రజలు తులసీగానే గుర్తుపెట్టుకుంటున్నారంటే ఈ పాత్రకు ఉన్న ఆదరణ అర్థం అవుతుంది. దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు ఇరానీ ఈ సీరియల్ లో నటించారు. ‘క్యూంకీ సాస్‌ భీ కభి బహూ థీ’ సీరియల్ మొదలై 17 సంవత్సరాలు అయిన సందర్భంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన పాత చిత్రాన్ని ప్రజలతో పంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *