ముత్తుట్ భారీ దోపిడీ యత్నం విఫలం

దోపిడీ దొంగలు ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలనే లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా మైలార్ దేవుల పల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో భారీ దోపిడీకి విఫలయత్నం జరిగింది. ఉదయం పది గంటల ప్రాంతంలో ముత్తూట్ కార్యాలయంలోకి వినియోగ దారుల్లాగా వచ్చిన దుండగులు కంపెనీ అసిస్టెంట్ మేనేజర్ లతీఫ్ కు తుపాకి గురిపెట్టి బెదిరించారు. మొత్తం దుండగలు ముత్తూట్ ఫైనాన్స్ లోకి ప్రవేశించినట్టు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. తూపాకీతో పాటుగా కత్తితో కూడా లతీఫ్ ను బెదిరించారు. అయితే లతీఫ్ బెదిరిపోకుండా కార్యాలయంలోని అలారంను మోగించడంతో కంగారుపడ్డ దుండగలు అక్కడి నుండి పారిపోయారు. దోపిడీ యత్నం సమాచారాన్ని అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దోపిడీ యత్నం జరిగిన తీరును పోలీసులు అడిగి తెలుసుకున్నారు. రామచంద్రాపురం ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో డిసెంబర్ నెలలో భారీ చోరీ జరిగింది. ఈ చోరిలో 42 కిలోల బంగారన్ని దొంగలు దోచుకుని పోయారు. ఈ దోపిడీ తరువాత పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులు ముత్తూట్ యాజమాన్యాన్ని కోరారు. అయితే వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తాజాగా మైలార్ దేవుల పల్లి ఘటనలో తేలిపోయింది. ముత్తూట్ కార్యాలయంలో సరైన భద్రతా చర్యలు లేవని పోలీసులు చెప్తున్నారు. తమ హెచ్చరికలను కూడా ముత్తూట్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని పోలీసులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *