హైదరాబాద్ స్కూల్ పిల్లల్లోనూ డ్రగ్స్ వాడకం

ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులను దాటుకుని మత్తు మహంమ్మారి పదో తరగతి కూడా పాస్ చిన్నారులను కబళిస్తోంది. నగరంలోని కొన్ని ప్రముఖ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రమాదకర మత్తు మందులను వాడుతున్నట్టు రాష్ట్ర అబ్కారీ శాఖ అనుమానం వ్యక్తం చేస్తోంది. దీనికి సంబంధించిన ఆధారాలను సైతం వారు సేకరించారు. “ రాత్రి అద్భుతంగా గడిచింది… అదే అనుభూతి కోసం ఎదురుచూస్తునా…” మత్తు పదార్థాలు తీసుకున్న తరవాత ఒక తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పెట్టిన మెసేజ్ ఇది… దీన్ని చూసిన అధికారులే అవాక్కయ్యారు. ఇప్పటివరకు ఈ విష సంస్కృతి కేవలం కళాశాలలకే పరమితం అనుకుంటే ఇప్పుడది స్కూళ్లకు కూడా పాకింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులే షాక్ కు గురవుతున్నారు. నగరంలోని కొన్ని ప్రముఖ స్కూళ్లలో మాదక ద్రవ్యాల వాటకం పై వారు సందేఙాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీనికి సంబంధించిన వివరాలను అధికారులు బయటకు వెల్లడించనప్పటికీ ఈ దారుణ సంస్కృతి మరింత పెరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్కూళ్ల యాజమాన్యాలకు తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నారు.
విశ్వనగరంగా మారతున్న హైదరాబాద్ కు ఆధునిక హంగులతో పాటుగా ప్రమాదకర పోకడలూ వస్తున్నాయి. మధ్యం మత్తు సరిపోని కొంత మంది మరింత మత్తుకోసం మాదద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. గంజాయి, హెరాయిన్ తో పాటుగా అత్యంత ప్రమాదకరమైన, ఖరీదైన మత్తు పదార్థాలు కూడా ఇప్పుడు నగరంలో లభిస్తున్నాయి. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మత్తు పదార్థాల వాడకం పెరుగుతూనే ఉంది. నగరంలోని పలు కాలేజీలకు చెందిన విద్యార్థులు మత్తుకు బానిసలుగా మారుతున్నారు. తొలుల మత్తు పదార్థాల వాడకం నుండి వాటి అమ్మకం దారులుగా మారుతున్నారు. దీనితో వీటిని వాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నగరంలోని కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో మత్తు పదార్థాల వాడకం ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు గుర్తించి దానికి అనుగుణంగా చర్యలు చేపట్టారు. విద్యార్థులకు మత్తు మందులను సరఫరా చేస్తున్న ముఠాలను కటకటాల వెనక్కి నెట్టార. అయినా ఈ వ్యాపారం కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూనే ఉంది.
మత్తులో ఆనందాన్ని వెతుక్కుంటున్న వారు దీనికి బానిసలుగా మారుతున్నారు. మత్తు పదార్థాల వాడకం దారుల్లో ఎక్కువ శాతం సమాజంలో ఉన్నత వర్గాలవారే ఉండడం విశేషం. బహుళజాతి సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు వీటికి బానిసలుగా మారుతున్నారు. తాజాగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ జరిపిన దాడుల్లో పట్టుపడ్డ మత్తు పదార్థాలను వాడుతున్న వారిలో కొంత మంది ప్రముఖులు కూడా ఉన్నట్టు ఆ శాఖాధిపతి అకున్ సబర్వాల్ వెల్లడించారు. ఒక ప్రముఖ నిర్మాత కూడా మత్తుపదార్థాలను వినియోగిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
మత్తు పాదర్థాలను వినియోగిస్తున్న వారిలో స్కూల్ పిల్లలు కూడా ఉండడం కలకలం రేపుతోంది. ఒక స్కూల్ విద్యార్థిని వీటిని వాడుతున్నట్టు గుర్తించిన అధికారులు మరికొంత మంది స్కూల్ విద్యార్థులు కూడా వినియోగదారుల్లో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. దీనిపై సమగ్రంగా విచారణ జరుపుతున్నామని అధికారులు పేర్కొన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *