భారత్ ఇజ్రాయిల్ ల మైత్రిలో కొత్త పుంతలు

భారత్ –ఇజ్రాయిల్ దేశాల మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కనున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ లో పర్యటించనున్నారు. భారత్ దేశానికి చెందిన ఓ ప్రధాని ఇజ్రాయిల్ లో పర్యటించడం ఇదే మొదటిసారి. నాటకీయ పరిణామాల మధ్య ఏర్పడిన ఇజ్రాయిల్ తన అస్థిత్వాన్ని కాపాడుకోవడం కోసం నిత్యం యుద్ధాలు చేస్తూనే ఉంది. పొరుగున ఉన్న అన్ని దేశాలతో ఇజ్రాయిల్ తో సరిహద్దు సమస్యలు ఉన్నాయి. ఇజ్రాయిల్ ను దెబ్బతీసేందుకు ఈ రాజ్యాలు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నా ఇజ్రాయిల్ వాటినన్నింటినీ ఎదిరించి నిలబడింది. అమెరికా అండదండలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఇజ్రాయిల్ అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో అభివృద్ధి పథంలోకి దూసుకుని పోవడం అక్కడి ప్రజల పట్టుదలకు, కష్టించే తత్వానికి, మాధాశక్తికి నిదర్శనం.
ఇజ్రాయిల్ తో మన దేశానికి మొదటి నుండి పెద్దగా రాజకీయ సంబంధాలు లేవు. అరబ్ దేశాలతో ఆ దేశనికి ఉన్న విభేదాలే ఇందుకు ప్రధానకారణం. అనేక కారణాల వల్ల పాలస్థీనాకు మద్దతు పలుకుతూ వచ్చిన భారత్ ఇజ్రాయిల్ ను దూరం పెట్టింది. ముస్లీం ఓటు బ్యాంకు రాజకీయాలు ఒక కారణం అయితే చమురు కోసం అరబ్ దేశాలపై ఆధారపడడం ఆయా దేశాలకు ఇజ్రాయిల్ తో వేభేదాలు మరో కారణం. పెద్ద సంఖ్యలో అరబ్ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయుల వల్ల కూడా ఇజ్రాయిల్ కు మనదేశం దూరంగా ఉంటూ వచ్చింది.
• 1950-90 వరకు ఇజ్రాయిల్ తో పెద్ద గా సంబంధాలు లేవు.
• 1992 జనవరిలో నాటి పీ.వీ. నరసింహా రావు హయాంలో భారత్ –ఇజ్రాయిల్ సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి.
• 1992 నుండి నేటి వరకు అనేక విషయాల్లో కలసి సాగుతున్న భారత్-ఇజ్రాయిల్
• భారత్ కు అతిపెద్ద మిలటరీ వస్తువుల విక్రయదారుల్లో ఇజ్రాయిల్ ఒకటి
• రష్యా, అమెరికా తరువాత ఇజ్రాయిల్ భారత్ కు అతిపెద్ద మిలటరీ సరఫరాదారు
• రక్షణ రంగంలో ఇజ్రాయిల్ సహకారాన్ని కోరుతున్న భారత్
• ఆయుధాల సరఫరాతో పాటుగా భారత్ కు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్న ఇజ్రాయిల్
• నిఘా సమాచారంలో కీలకంగా మారిన ఇజ్రాయిల్
• ఇస్లామిక్ తీవ్రవాదానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్న ఇరు దేశాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *