శిరీష కేసులో తేజస్వినిని ప్రశ్నించిన పోలీసులు

0
53

బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసును పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. శిరీష్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న శ్రవణ్, రాజీవ్ లను జైలు నుండి విచారణ నిమిత్తం తమ కష్టడీకి తీసుకున్న పోలీసులు వారిని అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. శిరీషను కుకునూర్ పల్లి ఎస్.ఐ శ్రీనివాస్ రెడ్డి దగ్గరకి ఎందుకు తీసుకుని వెళ్లారంటూ పోలీసులు శ్రవణ్, రాజీవ్ లను విడివిడిగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. శిరీష ను ఒక పథకం ప్రకారమే వీరు కుకనూర్ పల్లికి తీసుకుని పోయినట్టు విచారణలో వెల్లడయినట్టు సమాచారం. ఈ కేసు విచారణ కోసం వచ్చిన సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న ఆధ్వర్యంలో పోలీసులు వీరిద్దరినీ ప్రశ్నిస్తున్నారు. జూన్ 12వ తేదీ రాత్రి అసలు కుకునూర్ పల్లిలో ఏం జరిగింది అన్ని విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
శిరీష ఆత్మహత్య కేసుతో ప్రమోయం ఉన్న తేజస్విని అనే యువతిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బెంగళూరులోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో హెచ్.ఆర్ విభాగంలో పనిచేస్తున్న తేజస్వినిని పిలిపించిన పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు. తాను రాజీవ్ ను ఇష్టపడ్డానని అతన్ని పెల్లి చేసుకుందామని భావించినట్టు తేజస్విని పోలీసులు చెప్పినట్టు తెలిసింది. రాజీవ్ తో చనువుగా ఉండడంతో పాటుగా రాజీవ్ ను పెళ్లి చేసుకోకుండా శిరీష అడ్డుపడిందని తేజస్విని చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై తాను, శిరీష పలుసార్లు  గొడపడినట్టు తేజస్విని పోలీసులకు చెప్పింది. తనకు, శిరీష కు మధ్య ఉన్న గొడవపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని అయితే రాతపూర్వకంగా ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదని తేజస్విని పోలీసులకు వెల్లడించింది. శిరీష రాజీవలకు  సంబంధించిన పలు కీలక విషయాలను తేజస్విని పోలీసులకు చెప్పినట్టు సమాచారం.
 

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here