రోప్ వే ప్రమాదం దేవుని చర్య అంటున్న కంపెనీ

0
57

కాశ్మీర్ లోని ప్రఖ్యాత గుల్మార్గ్ రోవ్ పై ప్రమాదంపై ఈ రోప్ వే ను నిర్వహిస్తున్న కంపెనీ స్పందించింది. గుల్మార్గ్ లో రోప్ వే పై భారీ వృక్షం పడడంతో కేబుల్ కార్ తెగిపడి 7గురు మృతి చెందిన సంగతి తెలిసిందే.  దీన్ని దురదృష్ట ఘటనగా పేర్కొంది. ఈ ప్రమాదాన్ని దేవుని చర్యగా రోప్ వే ను నిర్వహిస్తున్న గోండోల కేబుల్ కార్ సర్వీస్ సంస్థ అంటోంది. తాము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ ప్రమాదం జరిగిందని సదరు సంస్థ జనరల్ మేనేజర్ రియాజ్ అహ్మద్ అన్నారు. రోప్ వే అత్యన్నత భద్రతా ప్రమాణాలతో నిర్వహిస్తున్నమని అన్నారు. దీంట్లో అంతర్గత భద్రతా వ్యవస్థ ఉందని చెప్పారు. పరిమితికి మించిన గాలులు వీచిన సమయంలో కేబుల్ కార్లు వాటికవే ఆగిపోతాయని అటువంటి వ్యవస్థ ఉందని చెప్పారు.
తాము పూర్తిగా నిబంధనలకు లోబడే కేబుల్ కార్లను నడుపుతున్నట్టు రియాజ్ అహ్మద్ అన్నారు. గాలుల తీవ్రత అధికంగా ఉన్న సమయంలో రేప్ వేను నడిపించామంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. కేబుల్ సర్వీస్ ప్రారంభించిన సమయంలో వాతావరణం పూర్తిగా అనుకూలంగానే ఉందని చెప్పారు. భారీ వృక్షం వేళ్లతో సహా కూలిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. ఐదు, ఆరో టవర్ల వద్ద కేబుల్ తెగిపోయిందని చెప్పారు. కేబుల్ కార్లు తెగి కిందపడలేదని ఒక్కసారిగా వాటిపై వృక్షం పడడంతో  అవి ఊగిపోయాయని దానితో అందులో ఉన్న వాళ్లు కింద పడిపోయారని అన్నారు.
కేబుల్ కార్ల ప్రమాద ఘటనపై జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ప్రెంచి కంపెనీ-జమ్ము కాశ్మీర్ ప్రభుత్వాలు ఈ రోప్ వే ను నిర్వహిస్తున్నాయి. గుల్మార్గ్ రోప్ వే కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. మంచు కొండల మీదుగా రోప్ వే ప్రయాణం ఆహ్లాదాన్ని పంచుతుండడంతో పెద్ద సంఖ్యలో యాత్రికులు రోప్ వే ను ఎక్కడానికి ఆశక్తి చూపిస్తారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here