యదావిధిగా రవితేజ సినిమా షూటింగ్

0
49

ప్రముఖ తెలుగు హీరో రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మరుసటి రోజే రవితేజ యధావిధిగా తన చిత్ర షూటింగ్ కు హాజరయ్యాడు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న రాజా ది గ్రేట్ సినిమా షూటింగ్ కు ఆయన హాజరయినట్టు సమాచారం. షూటింగ్ వాయిదా వేయాల్సి వస్తుందని అనుకుంటున్న దర్శకుడికి స్వయంగా ఫోన్ చేసిన రవితేజ తాను షూటింగ్ కి వస్తున్నట్టు సమాచారం ఇచ్చినట్టు చిత్రవర్గాల కథనం. అవుటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో రవితేజ సోదరుడు భరత్ చనిపోయిన సంగతి తెలిసిందే. భరత్ అంత్యక్రియలకు కూడా రవితేజ హాజరు కాలేదు. రవితేజతో పాటుగా ఆయన కుటుంబ సభ్యుల్లో ఒక సోదరుడు మినహా మరెవరూ అంత్యక్రియలకు హాజరుకాలేదు. పోస్టుమార్టం తరువాత మృతదేహాన్ని నేరుగా మహాప్రస్తానం శ్మశానవాటికకు తరలించి అక్కడే అంత్యక్రియలు పూర్తిచేశారు.
రవితేజ సోదరుడు భరత్ కొన్ని చిత్రాల్లో కూడా నటించాడు. ఒకరిద్దరు నటులు మినహా మరెవరూ అంత్యక్రియలకు హాజరుకాలేదు. కడసారి చూసేందుకు కూడా కుటుంబసభ్యులు రాకపోవడం చర్చనీయాంశమైంది. మధ్యానికి అలవాటు పట్ట భరత్ ఇటీవల కుటుంబానికి దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. ఆయనకు వివాహం జరిగినప్పటికీ అటు భార్యతో పాటుగా ఇటు అన్నదమ్ములు, తల్లిదండ్రులకు కూడా దూరంగా ఒంటరిగా ఉంటున్నట్టు సమాచారం. భరత్ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసుల దర్యాప్తులో పలు విషయాలు వెల్లడయ్యాయి. నోవాటెల్ లో ఒక స్నేహితుడి పార్టీకి హాజరయిన భరత్ అక్కడ పలు దఫాలుగా మధ్యం సేవించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. నోవాటెల్ సి.సి. కెమెరాల్లో భరత్ మధ్యం తాగుతూ కనిపించినట్టు తెలుస్తోంది.
మధ్యం మత్తులో కూరుకుని పోయిన భరత్ ఒంటరివాడుగా మిగిలిపోయాడని భరత్ సన్నిహితులు చెప్తున్నారు. నిత్యం మధ్యం మత్తులో ఉండే అతను చివరికి ఆ మత్తులోనే ప్రాణాలు కోల్పోయాడని విచారం వ్యక్తం చేస్తున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here