రాజకీయాలకు అతీతంగా రాష్ట్రపతి ఎన్నిక:వెంకయ్య

0
61

రాష్ట్రపతి ఎన్నికలను రాజకీయ కోణంలో చూడవద్దని బీజేపీ అంటోంది. రాజ్యాంగాధినేత ఎన్నికలను రాజకీయాలతో ముడిపెట్టడం సమంజసం కాదని ఆ పార్టీ నేత, సీనియర్ మంత్రి వెంకయ్య నాయుడు అంటున్నారు. దేశ ప్రధమ పౌరుడి ఎన్నికను రాజకీయం చేయకుడదని ఆపదవికి ఉన్న గౌరవాన్ని అందరూ కాపాడాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాష్ట్రపతి రాజ్యాంగానికి అత్యంత గౌవరం ఇచ్చే వ్యక్తి అయిఉండాలని ఆయన అన్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ రాష్ట్రపతి పదవికి అన్ని విధాలుగా అర్హుహడని వెంకయ్యనాయుడు అన్నారు. దేశ అత్యన్నత పదవిని అలంకరించే వ్యక్తికి ఉండాల్సిన అన్ని లక్షణాలు రామ్ నాథ్ కోవింద్ కు ఉన్నాయని ఆయన చెప్పారు. న్యాయశాస్త్ర కోవిదుడు అయిన రామ్ నాథ్ ను అన్ని వర్గాలు బలపర్చాలని వెంకయ్యనాయుడు కోరారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here