భారత్ ఓడితే సంబరాలు-కఠిన చట్టంకింద కేసులు

భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్స్ లో భారత్ దారుణ ఓటమితో ఓ వైపు కోట్లాది మంది భారతీయ అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయి ఉంటే మరో వైపు కొంత మంది మాత్రం పాకిస్థాన్ కు మద్దతుగా నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. దేశంలోని పలు చోట్ల ఈ తరహా ఘటనలు జరిగినట్టు వార్తలు వచ్చినప్పటికీ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు ఇటువంటి వారిపై కఠిన చర్యలకు తీసుకుంటున్నాయి. రాజస్థాన్ లో బికనీర్ లో భారత క్రికెట్ జట్టు ఓటమి తరువాత సంబరాలు చేసుకుంటూ బాణాసంచా కాల్చిన వారిపై కేసులు నమోదయ్యాయి. ఇటు మధ్యప్రదేశ్ లో కూడా పోలీసులు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ లో అయితే వీరిపై రాజద్రోహ చట్టం కింద కేసులు నమోదు చేశారు. సుభాష్ పురా లోని 15 మందిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా మొత్తం 36 మందిదాకా అరెస్టయ్యారు. కర్ణాటక లోని కొడుగు జిల్లాలోను కొంత మంది పాకిస్థాన్ గెలుపు సంబరాలు నిర్వహించార. వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.
పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేసిన వారిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాజద్రోహం చట్టం కింద కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఈ చట్టం కింద నమోదయిన కేసుల్లో నేరం రుజువయితే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. భారత క్రికెట్ జట్టు ఓడిపోవడంతోనే బయటకు వచ్చి సంబరాలు చేసుకుంటూ పాకిస్థాన్ కు అనుకూలంగా నినాదాలు చేసిన వారిపై పోలీసులు రాజద్రోహ చట్టం కింద కేసులు నమోదు చేశారు. దీనిపై ముస్లీం సంఘాలు మండిపడుతున్నాయి. ఇంత కఠినమైన చట్టాల కింద కేసులను నమోదు చేయడం సరికాదని అంటున్నాయి. అయితే భారత వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించడంలో తప్పులేదని హింధూ వాదులు అంటున్నారు.  పరాయి దేశానికి అనుకూలంగా నినాదాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *