కాశ్మీర్ లో ముగ్గురు మిలిటెంట్ల హతం

దక్షిణ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు లస్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. దాదాపుగా ఆరు గంటలపాట జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రతా దళాలు ముగ్గురు మిలిటెంట్లను కాల్చి చంపాయి. చనిపోయిన ఉగ్రవాదుల్లో కరడుగట్టిన ఉగ్రవాది మాజిద్ మీర్ కూడా ఉన్నట్టు పోలీసులు వెళ్లడించారు. చనిపోయిన తీవ్రవాదులకు అనేక నేరాలతో సంబంధం ఉందని పోలీసులు చెప్పారు. మాజిద్ మీర్ తో పాటు చనిపోయిన మరో ఇద్దరిని సిద్దిఖ్ అహ్మద్, ఇర్షాద్ అహ్మద్ లుగా పోలీసులు గుర్తించారు. చనిపోయిన తీవ్రవాదులందరికీ అనేక నేరాలతో, హత్యలతో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
నిఘా వర్గాల సమాచారం మేరకు స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్, సైనిక బలగాలు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా ఒక ఇంట్లో తీవ్రవాదులు ఉన్నట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. వారిని లొంగిపోవాల్సిందిగా హెచ్చరించినా తీవ్రవాదులు కాల్పలకు దిగారు. దీనికి ప్రతిగా భద్రతా బలగాలు కూడా కాల్పులు ప్రారంభించాయి. దాదాపు ఆరు గంటల పాటు ఇరు వైపుల నుండి తీవ్రస్థాయిలో ఎదురు కాల్పులు జరిగాయి. ఎట్టకేలకు భద్రతా దళాలు ముగ్గురు మిలిటెంట్లను హతమార్చడంతో ఈ భారీ ఎన్ కౌంటర్ కు తెరపడింది. చనిపోయిన తీవ్ర వాదుల నుండి భారీ స్థాయిలో తుపాకులు మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *