ఢిల్లీకి కేసీఆర్

0
54

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి పలు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఢిల్లీలోనే సీఎం కంటికి సంబంధించిన పరీక్షలు చేయించుకుంటారని సమాచారం. రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్ నాథ్ కోవింద్ జూన్ 23న నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నట్టు తెలుస్తోంది. ఎన్డీఏ పక్షాలతో పాటుగా టీఆర్ఎస్ లాంటి తటస్థ పార్టీలు కూడా రామ్ నాథ్ నామినేషన్ పత్రాలపై సంతాకాలు చేయనున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ తరపున ఒక సెట్ నామినేషన్ పత్రాలు  దాఖలు అయ్యే అవకాశాలున్నాయి. నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు అవుతారని సమాచారం.
రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ ను ఎంపిక చేసిన తరువాత ప్రధాని మోడీ దేశంలోని కొంత మంది ప్రధాన రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ, నేతలతోనూ ఫోన్ లో మాట్లాడారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఫోన్ చేసిన మోడీ రామ్ నాథ్ ను ఎంపిక చేసిన విషయాన్ని చెప్పారు. ప్రధాని మోడీ కేసీఆర్ కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి స్వయంగా ఫోన్ లో మాట్లాడినందును మర్యాద పూర్వకంగా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనాలను సీఎం నిర్ణయించుకున్నట్టు సమాచారం.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here