సిరిసిల్లను వదలను:కేటీఆర్

0
57

తాను రాజకీయాల్లో ఉన్నంతవరకు సిరిసిల్ల నుండే పోటీ చేస్తానని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జిల్లాలో వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి తాను సిరిసిల్ల నియోజకవర్గం నుండి మారేది లేదని తేల్చి చెప్పారు. కేటీఆర్ రానున్న ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుండి కాకుండా వేరే నియోజకవర్గం నుండి పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలకు దీనితో తెరపడినట్టయింది. అన్ని రంగాల్లో సిరిసిల్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కేటీఆర్ హామీ ఇచ్చారు. సిరిసిల్ల లోని చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని దీని కోసం కార్యచరణను రుపొందించినట్టు కేసీఆర్ వెళ్లడించారు. చేనేత కార్మికులకు రు.200 కోట్ల విలువైన ఆర్డర్లను ఇచ్చామని చెప్పారు. దీని ద్వారా ఒక్కో కార్మికుడికి నెలకు రు.15వేలు అందుతాయని అన్నారు. నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల లోపల ఆ పనులు పూర్తవుతాయన్నారు.
సిరిసిల్ల పట్టణంలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు.  స్వచ్ఛ సిరిసిల్లలో భాగంగా చెత్తబుట్టలను కేటీఆర్ పంపిణీ చేశారు. దేశంలోని ఏ ప్రభుత్వం చేయనటువంటి సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం చేపడుతోందని చెప్పారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here