రామ్ నాథ్ కు టీఆర్ఎస్ మద్దతు

0
42

రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ప్రతిపాదించిన రామ్ నాథ్ కోవింద్ కు టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలు మద్దతు ప్రకటించించాయి. ఎన్టీఏ ప్రతిపాదించిన అభ్యర్థికి మద్దతు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ధృవీకరించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ ను ఎంపిక చేసిన తరవాత మోడీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్ లో మాట్లాడారు. ఇటు కేసీఆర్ తో పాటుగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇతర సీఎంలతో కూడా ప్రధాని మాట్లాడినట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి  మద్దతు ఇస్తామని ఏపీ సీఎం ఇప్పటికే ప్రకటించగా తాజాగా తెలంగాణ సీఎం కూడా రాష్ట్రపతి ఎన్నిక్లలో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.
వివిధ అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్ నాథ్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తోంది. ఎన్డీఏ లో భాగస్వామ్య పక్షంగా ఉన్న తెలుగుదేశం గతంలోనే బీజేపీకి మద్దతు ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికలు అనివార్యం అయిన పక్షంలో బీజేపీకి ఎదురులేకుండా చేసుకునే క్రమంలో ఎన్డీఏ భాగస్వాములతో పాటు తటస్తంగా ఉన్న పార్టీల మద్దతు కోసం మోడీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి.తెలంగగాణ సీఎం మద్దతుకు ఓకే చెప్పగా అటు తమిళనాడు సీఎం కూడా బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికే మద్దతు ఇస్తున్నట్టు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు.
 

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here