ఎన్టీఏ రాష్ట్రపతి అభ్యర్తి ఈయనే…

0
39

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేదానిపై ఉత్కంఠ వీడింది. తమ కూటమి నుండి రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాధ్ కోవింద్ పేరును బీజేపీ ప్రకటించింది. ప్రస్తుతం ఆయన బీహార్ గవర్నర్ గా పనిచేస్తున్నారు. రామ్ నాధ్ పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. బీజేపీ కి చెందిన ఈ దళిత నేత ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉంది. బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన రామ్ నాధ్ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. న్యాయవాదిగా సుదీర్ఘకాలం పాటు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పనిచేసిన రామ్ నాధ్ కు ఆర్ఎస్ఎస్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నయి. ఉన్నత విద్యావంతుడు కావడంతో పాటుగా దళిత నేతగా పేరుగాంచిన ఆయన పేరును బీజేపీ వ్యూహాత్మకంగా రాష్ట్రపతి పదవికి ఎంపిక చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here