మొదలైన ఫైనల్స్ వేడి

0
68

అసలే భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్… అందునా ఓ మోగా టోర్నో ఫైనల్ లో … క్రికెట్ అభిమానులకు ఇంతకన్నా కావాల్సింది ఏముది… ఆదివారం (జూన్ 18) నాడు జరిగే మ్యాచ్ కోసం కళ్లు కాయలు కాచేలా క్రికెట్ అభిమానులు వేచిస్తున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వేడి ఇప్పటి నుండే మొదలైంది. మరోసారి పాకిస్థాన్ ను బారత్ ఉతికి ఆరేయడం ఖాయమని భారత్ అభిమానులు అంటున్నారు. లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ కు చుక్కలు చూపించిన భారత్ ఫైనల్ లోనూ మరోసారి వారికి భారత్ దెబ్బను రుచిచూపించాలని అభిమాలు అంటున్నారు. భారత్ విజయం ఖాయమని అంటూ పాకిస్థాన్ కు మరో ఓటమి ఖాయమనులు అంటున్నారు. పాకిస్థాన్ ను ఓడించి కప్పు అందుకుంటే ఆ మజానేవేరు… అటువంటి మజాను ఆస్వాదించేందుకు ఇప్పటి నుండే రెడీ అయిపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇప్పటి నుండే బారత్-పాక్ మ్యాచ్ కు సంబంధించిన వేడి మొదలైంది. భారత్ దెబ్బకు పాకిస్థాన్ దిమ్మతిరగడం ఖాయమనే తరహాలో జోక్ లు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. ఇప్పటికే లీగ్ దశలో పాకిస్థాన్ ను ఓడించిన భారత్ అదే తరహా ప్రదర్శనతో మరోసారి పాకిస్థాన్ భరతం పట్టాలని భారత్ క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయి టోర్నీని దారుణంగా మొదలు పెట్టిన పాకిస్థాన్ ఆ తరువాత అనూహ్యంగా పుంజుకుంది. సౌత్ ఆఫ్రికా, శ్రీలంక లను ఓడించి సెమీస్ చేరిన పాక్ అక్కడా ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఫైనల్ లో చిరకాల ప్రత్యర్థి భారత్ తో తలపడనుంది. లీగ్ మ్యాచ్ లోభారత్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని అటు పాక్ జట్టుతో పాటుగా ఆ దేశ అభిమానులు కూడా ఆశిస్తున్నారు. అయితే వారి ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.
photo courtesy: indian express

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here