ప్రధాని మోడికి సీఎం లేఖ

జీఎస్టీ పన్ను శ్లాబ్ లపై తెలంగాణ రాష్టానికి ఉన్న అభ్యంతరాలను ముఖ్యంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకుని వెళ్లారు. జీఎస్టీ పన్ను విధానంలో కొన్ని ఉత్పత్తులపై విధిస్తున్న పన్ను మరీ ఎక్కువగా ఉందని భావించిన తెలంగాణ సర్కారు దీనిపై పునరాలోచించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీలకు లేఖరాశారు. బీడీ పరిశ్రమలపై అధిక పన్నులు వేయడాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తున్న తెలంగాణ సర్కారు బీడీ పరిశ్రమపై వేసిన పన్నును తగ్గించాలని సీఎం కోరారు. ఈ పరిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారని సీఎం ప్రధాని, ఆర్థిక మంత్రుల దృష్టికి తీసుకుని వచ్చారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని అధిక పన్ను వల్ల వారంతా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని సీఎం తన లేఖలో పేర్కొన్నారు. దీనితో పాటుగా గ్రానైట్ పరిశ్రమపై విధించిన పన్నును కూడా తగ్గించాలని సీఎం కోరారు. తెలంగాణలో 2వేలకు పైగా గ్రానైట్ యూనిట్లు ఉన్నాయని దీనిపై ఆధారపడి దాదాపు 7 లక్షమ మంది ఉపాధి పొంతుతున్నారని సీఎం వివరించారు. అధిక పన్ను విధించడం వల్ల గ్రానైట్ పరిశ్రమ దెబ్బతినే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. ఈ రెండు అంశాలపై దృష్టిపెట్టాలని సీఎం ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న మిషన్ భగీరథ, నీటిపారుదల ప్రాజెక్టు పనులను జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలని కూడా సీఎం కోరారు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ తాగునీరు, ప్రతీ పొలానికి సాగు నీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ రెండు పథకాలకు జీఎస్టీ నుండి మినహాయింపు ఇవ్వాలని సీఎం కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *