రోడ్డుపక్కన పడుకుంటే నిప్పంటించారు

0
70

చెన్నైలో నలుగురు యువకుల విపరీత చేష్టలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన పడుకున్న అభాగ్యుడిపై పెట్రోలు పోసి నిప్పంటించడంతో పాటుగా ప్రతిఘటించడానికి ప్రయత్నించిన అతన్ని దారుణంగా కొట్టారు. తాము చేసిన ఈ ఘనకార్యాన్ని సెల్ ఫోన్ లో రికార్డు చేశారు. ఈ దారుణ దృశ్యాలు వెలుగులోకి రావడంతో అవి వైరల్ గా మారాయి. ఇంతటి దారుణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 4వ తేదీన జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  చెన్నైలోని కోడంబక్కం ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానిక రంగరాజపురంలోని బ్యాంకు వద్ద రోడ్డుపై నిద్రపోతున్న జాఫర్ అనే వ్యక్తి పై నలుగురు యువకులు రాత్రి 1.30 సమయంలో నిప్పంటించారు. మంటల నుండి అతను తప్పించుకునే ప్రయత్నం చేయగా అతన్ని కొట్టి గాయపర్చారు. తామేదో ఘనకార్యం చేసినట్టుగా ఈ ఘటనంతా వీడియో తీశారు. అది కాస్తా బయటకు పొక్కడంతో వీడియో వైరల్ అయింది.
ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని పోలీసులు గుర్తించారు. నలుగురు యువకుల్లో ఒకరు మైనర్ కావడం గమనార్హం. శ్యాం, పుగంజిదీ, రాజేశ్ తో పాటుగా మరో మైనర్ ఈ దారుణ చర్యకు దిగారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు గాయపడ్డ జాఫర్ కోసం వెతుకున్నారు. అతని నుండి ఫిర్యాదు తీసుకుని కేసును నమోదు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. మధ్యం మత్తులో తాము ఈ చర్యకు దిగినట్టు నిందితులు చెప్తున్నారు. రోడ్డు పక్కన నిద్రిస్తున్న వ్యక్తి శరీర భాగాలకు నిప్పింటి దారుణానికి తెగబడిన వారిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here