పలు చోట్ల వర్షాలు-నిర్మల్ లో తప్పిన ప్రమాదం

0
73

adilabad(పిడుగు పాటుకు ఫంక్షన్ హాల్ లో మంటలు)
రుతుపవనాల రాకతో తెలంగాణ, ఏపీల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడగా మరికొన్ని చోట్ల భారీ వర్షలు కురిశాయి. అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడగా కొన్ని చోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగులతో  నిర్మల్ జిల్లాలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ పై పిడుగుపడింది. ఈ ప్రమాదంలో హాల్ లోని ఫర్నిచర్ కాలిపోయింది. పిడుగు పడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ పట్టణంలో కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఒక కారు ప్రమాదవశాత్తు అందులోపడి కొట్టుకుని పోయింది.
హైదరాబాద్ లోనూ భారీ వర్షం పడింది. నగరంలోని దాదాపు అన్ని చోట్లా భారీగా వర్షం పడింది. మధ్యాహ్నం సమయంలో మొదలైన వర్షం రాత్రి వరకు కురిసింది. చాలా చోట్ల రోడ్లపై వర్షం నీరు నిల్చిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం సమయాల్లో పలు చోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపై నిల్చిన నీళ్లను తొలగించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించాయని మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here