మనసుదోచిన రచయిత మరిలేరు…

ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, సినీ గేయరచయిత, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ సి.నారాయణ రెడ్డి ఈ ఉదయం కన్నుశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బంజారాహిల్స్ లో కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆనేక సుప్రసిద్ద రచనలు చేసిన డాక్టర్ సి.నారాయణ రెడ్డి జనబాహుళ్యానికి సి.నా.రే.గా సుప్రసిద్దులు. ఆయన రాసిన “విశ్వంభర” కావ్యానికి 1988లో ప్రతిష్టాత్మక జ్ఞానపిఠ పురస్కారం లభించింది. 1977లో భారత ప్రభుత్వం సినారే పద్మశ్రీ తో సత్కరించింది. 1953లో ఆయన రాసిన ‘నవ్వని పువ్వు’ మొదలుకొని అనేక కావ్యాలను ఆయన రచించారు. సినారే పద్య కావ్యాలు, గేయ కావ్యాలతో పాటుగా  వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు అనేక వ్యాసాలు రాశారు. తెలుగుతో పాటుగా సినారేకు ఉర్థుపై కూడా గట్టి పట్టుండేది.
కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన హైదరాబాద్ లో ఉన్నత విధ్యను అభ్యసించారు. సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసిన ఆయన అక్కడి నుండి నిజాం కళాశాలలోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలంలో ఆచార్యుడిగా పనిచేసిన ఆయన అనేక మందికి గైడ్ గా వ్యవహరించారు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన వ్యక్తి సినారేనే. అనేక సినీ గీతాలను రాసిన ఆయన మొదటిసారిగా గులేభకావళి కథ చిత్రంలోని” నన్ను దోచుకుందువటే” పాటను రాశారు. అక్కడి నుండి ఆయన ఎన్నో చిత్రాలకు గీతాలను అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *