స్కూల్ కి పోదాం చలో…చలో…

వేసవి సెలవల తరువాత తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్లు తెరుచుకున్నాయి. పిల్లల స్కూల్ హడావుడి మొదలైంది. సెలవల తరువాత కొత్త పుస్తకాలు, బ్యాగులు, యూనిఫాం లతో పిల్లలు బడిబాట పట్టారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో ఈ దఫా ముందుగానే సెలవలు ప్రకటించడంతో గతంలో కంటే ఎక్కువ సెలవలు లభించినట్టయింది. కొన్ని స్కూళ్లు వారం ముందుగానే తెరిచినప్పటికీ అత్యధిక స్కూళ్లు ఈ రోజు నుండే ప్రారంభమయ్యాయి. ప్రతీ ఒక్కరు చదవుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 13 నుండి 17వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా స్కూల్ కి రావాల్సిన వయసులో పిల్లలు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు ఉపాధ్యయులు, ప్రభుత్వ అధికారులో గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ సర్వే చేసి పిల్లలను పాఠశాలలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.మరో వైపు ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల వాతలు ఏ మాత్రం తగ్గలేదు. దీనికి తోడు యూనిఫాం లు మొదలు పుస్తకాల వరకు అన్నీ తమ స్కూల్ లలో కొనలాంటి పెడుతున్న నిబంధనతో స్కూల్స్ సైడ్ బిజినెస్ ను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *