బీజేపీ vs రాజాసింగ్

0
63

రాజాసింగ్… పాతబస్తీ వాసులకు సుపరితమైన పేరు. అతివాద హింధూ నేతగా పేరుపొందిన రాజా సింగ్ ప్రస్తుతం గోషామహల్ నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో తెలుగుదేశం కార్పోరేటర్ గా ఉన్న ఆయన ఆ తరువాత బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయనకీ పార్టీకి మధ్య మొదటి నుండి పెద్దగా సత్సంబంధాలు లేవు. రాజా సింగ్ తెలంగాణ బీజేపీ నేతలను ఏమాత్రం ఖాతరు చేయడని తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాడనే పేరుంది. ఇటు బీజేపీ నేతలు కూడా ఆయన్ను పెద్దగా పట్టించుకోరు. పార్టీ కార్యకలాపాల్లో రాజాసింగ్ భాగస్వామ్యం తక్కువనే చెప్పాలి. ప్రస్తు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ తో కానీ గతంలో అధ్యక్షుడిగా వ్యవహరించిన కిషన్ రెడ్డితో కానీ రాజాసింగ్ కు ఏ మాత్రం సఖ్యత లేదు. తెలంగాణ కు చెందిన ఇతర బీజేపీ నేతలతో కూడా అంటీముట్టినట్టు ఉండే రాజా సింగ్ పార్టీ పెద్దలతో యుద్ధానికి దిగాడు. సొంత పార్టీ నేతలపై విమర్శలు చేయడం ఆయనకి కొత్తకాదు గతంలోనూ పార్టీ నేతలపై దుమ్మెత్తి పోసిన రాజాసింగ్ తెలంగాణ బీజేపీ నేతలకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు.
అతివాద హింధూ నేతగా పేరున్న రాజాసింగ్ సొంత ఎజెండాతో ముందుకు వెళ్తాడనే ఆరోపణలు ఉన్నాయి. తాను నిర్వహించే ఏ కార్యాక్రమాన్ని కూడా ముందుగా పార్టీనేతలతో చర్చించే అలవాటు రాజా సింగ్ కు లేదు. ఎప్పుడూ తనకు నచ్చినట్టు గా ముందుకు వెళ్లే ఆయన పనితీరుపై మొదటి నుంచే పార్టీ నేతలకు అభ్యంతరాలున్నాయి. రాజా సింగ్ నిర్వహించే ఏ కార్యక్రమం అయినా సొంత ప్రయోజనాలకు తప్ప పార్టీ ప్రయోజనాలు ఉపయోగపడదనేది బీజేపీ నేతల వాదన. సొంత ఇమేజ్ ను పెంచుకునే దిశగానే రాజాసింగ్ వ్యవహరిస్తారు తప్ప పార్టీ ప్రయోజనాలను ఏమాత్రం పట్టించుకోరని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని కేంద్రంలోని పార్టీ పెద్దల వద్ద తెలంగాణా బీజేపీ నేతలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అయితే రాజా సింగ్ వాదన మరోలా ఉంది. పాతబస్తీలో పట్టునిలుపుకోవడం కోసం తాను చేస్తున్న ప్రయత్నాలకు పార్టీ సహకరించడం లేదనేదని అంటున్నారు. తనకు పార్టీ బాసటగా నిలవడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. తన పరపతని చూసి ఓర్వలేని తనంతో తనను అణగదొచ్చే ప్రయత్నం చేస్తున్నారని రాజాసింగ్ మండిపడుతున్నాడు.
పాతబస్తీలో రాజీసింగ్ కు గణనీయమైన సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. అతివాద హింధూ నేతగా, వివాదాస్పద వ్యాఖ్యలతో దుకుడుగా వ్యవహరించే రాజాసింగ్ కు పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో గట్టి పట్టుంది. గోషామహల్ నుండి రాజాసింగ్ పార్టీ పరంగాకంటే వ్యక్తిగత ఇమేజ్ వల్లే గెలిచారనేది సుస్పష్టం. పాతబస్తీలో గట్టి నేతకోసం ఎదురుచూస్తున్న బీజేపీ రాజాసింగ్ లాంటి వారిని వదులుకునే పరిస్థితుల్లో లేదు. రానున్న ఎన్నికల్లో హైదరాబాద్ పార్టమెంటరీ స్థానంపై గట్టిగా కన్నేసిన బీజేపీ అధిష్టానానికి రాజాసింగ్ లాంటి నేతల అవసరం ఉంది. పాతబస్తీలో ఓవైసీలను ఢికొనే సత్తా ఉన్న నేత బీజేపీలో ఎవరూ లేరనేది బహిరంగ రహస్యమే. ఒకప్పుడు పాతబస్తీలో గట్టి పట్టున్న బీజేపీ క్రమంలో తన పట్టును కోల్పోయింది. నరేంద్ర, బద్దం బాల్ రెడ్డి లాంటి నేతలు ఒకప్పుడు పాతబస్తీలో మజ్లీస్ కు గట్టి పోటీ ఇచ్చారు. ఆ స్థాయి  నేతలు ఎవరూ ప్రస్తుతం బీజేపీలో కనిపించడం లేదు. కొద్దో గొప్పో పాతబస్తీలో పేరున్న రాజాసింగ్ లాంటి వారిని బీజేపీ వదులుకుంటుందా అనేది చూడాల్సిందే.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here