గ్రూప్-2 ఆరోపణల్లో ఏది నిజం…ఏది అబద్దం…

0
40

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-2లో అక్రమాలు జరిగాయని, కొంత మందికి లబ్ది చేకూరేవిధంగా కమిషన్ వ్యవహరించిందనే ఆరోపణలు ఒక వైపు వస్తుండగా… మరో వైపు అట్లాంటిది ఏదీ లేదని ఒక పథకం ప్రకారం ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. సామాజిక మాధ్యమాలే వేదికగా రెండు వర్గాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.
     వైట్నర్ వివాదం: గ్రూప్ 2 పరీక్షల్లో వైట్నర్ ఉపయోగించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ కొంత మంది వైట్నర్ ఉపయోగించే అవకాశం ఇచ్చారని దానితో వారు కోర్టుకు వెళ్లి మాన్యువల్ కరెక్షన్ కు అనుమతి తీసుకున్నారని దీంట్లో అక్రమాలు జరిగాయనేది ఒక వర్గం ఆరోపణ. అయితే కేవలం కోర్టు నిర్ణయం మేరకు నడుచుకున్నాం తప్ప ఎటువంటి అక్రమాలు జరగలేదని వైట్నర్ ఉపయోగించిన వారు తమ పేపర్ ను దిద్దాలంటూ కోర్టును ఆశ్రయించగా కోర్టు వారికి అనుకూలంగా తీర్పు చెప్పిందని వారు వివరిస్తున్నారు.
తెలంగాణ జాగృతి దేవేందర్ వివాదం:  తెలంగాణ జాగృతి నల్గొండ జిల్లా అధ్యక్షుడు భోనగిరి దేవేందర్ కు గ్రూప్ ఉద్యోగం వచ్చిందని ఆయనకు ఉద్యోగం రావడం వెనుకు నిజామాబాద్ ఎంపీ కవిత ఉన్నారంటూ ఒక వార్త  కాగా అసలు భోనగిరి దేవేందర్ గ్రూప్-2 పరీక్షకు అప్లైయే చేయలేదని అటువంటిది ఆయనకు ఉద్యోగం ఎట్లా వస్తుందని మరో వర్గం ప్రశ్నిస్తోంది. దేవేందర్ ఇప్పటివరకు అసలు టీఎస్పీఎస్పి వెబ్ సైట్ లో వన్ టైం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదని వారు చెప్తున్నారు. దేవేందర్ కు సంబంధించిన ఆధార్ కార్డు నంబర్ ను కూడా వారు ప్రచురించి ఎవరైనా నిజానిజాలు పరిశీలించుకోవచ్చని సవాల్ చేస్తున్నారు. తనను అప్రదిష్టపాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు కూడా దేవేందర్ సిద్ధపడుతున్నారు.
      కవిత సిపార్సువల్ల ఉద్యోగాలు:    గ్రూప్ -2 పరీక్షల్లో ఎక్కువ మంది నిజామాబాద్ నుండే ఎంపికయ్యారని ఎంపీ కవిత ఆశీస్సులు ఉన్నవారందరికీ ఉద్యోగాలు వచ్చాయనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. అయితే గ్రూప్-2 అభ్యర్థుల ఎంపిక విషయంలో అవిభక్త నిజామాబాద్ జిల్లా ఆఖరి నుండి రెండో స్థానంలో ఉందని మరో వర్గం లెక్కలతో సహా వివరిస్తోంది. కవిత ఆశీస్సులు ఉన్నవారికి ఉద్యోగాలు వచ్చాయనే వార్త పూర్తిగా నిరాధారమైందిగా వారు చెప్తున్నారు. గ్రూప్-2లో ఎంపికైన వారి వివరాలు తెలుసుకుని ఆరోపణలు చేయాలని వారంటున్నారు.
  సెంటర్ రగడ:  నిజామాబాద్ లోని ఒక సెంటర్ లో పరీక్ష రాసిన వారిలో ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చాయనేది మరో ఆరోపణ అయితే వారు ఆరోపణలు చేస్తున్న పేరుతో ఉన్న కాలేజీలో అసలు సెంటరే లేదని అటువంటి సమయంలో అక్రమాలు ఆస్కారం ఎక్కడుందని వారు ప్రశ్నిస్తున్నారు.
 

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here