కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి హఠాన్మరణం

0
42

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి హఠాత్తుగా మృతిచెందారు. కులులో జరగనున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన తాను ప్రయాణిస్తున్న వాహనంలోనే కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయారు. కాంగ్రెస్ పార్టీ  సీనియర్ నేతల్లో ఒకరైన పాల్వాయి గోవర్థన్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పనిచేసిన ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. నెహ్రు కుటంబానికి సన్నిహితుడిగా పేరున్న పాల్వాయి గోవర్థన్ రెడ్డి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. పార్టీలో పలు కీలక పదవులను నిర్వహించిన ఆయన పార్టీ కీలక నేతల్లో ఒకరిగా పేరు గాంచారు. కులులో మరణించిన పాల్వాయి మృత దేహాన్ని రాష్ట్రానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here