జీహెచ్ఎంసీ సత్వర చర్యలు-తెరుకున్న నగరం

0
40
HYDERABAD, AUG 31 (UNI):-A Greater Hyderabad Municipal Corporation (GHMC) worker clean a flooded road after heavy rain in Hyderabad on Wednesday. UNI PHOTO -18U

భారీ వర్షానికి తడిసిముద్దయిన నగరం మద్యాహ్నానికి తేరుకుంది. గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చిచేరాయి. రోడ్ల మీద నీరు నిల్చిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. నగరంలో ఉదయం నుండి 4.3 నుండి 5.5 సెం.మీ వర్షపాతం నమోదయింది. భారీ వర్షానికి ఎక్కడికక్కడ రోడ్లపై నీరు నిల్చిపోయింది. వెంటనే అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దేపనిలో పడ్డారు. మొదట రోడ్లపై నిల్చిపేయిన నీటిని తొలగించే పనిలో పడి ట్రాఫిక్ ను చక్కదిద్దారు. దాని తరువాత లోతట్టు ప్రాంతాల్లో నిల్చిపోయిన నీటిని తోడేశారు. ఉదయం కురిసిన భారీ వర్షం వల్ల కలిగిన ఉబ్బందులను మద్యాహ్నం కల్లా దాదాపుగా తొలగిపోవడంతో నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
భారీ వర్షం పల్ల నగర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే తొలగించాలని మంత్రి కేటీఆర్ అధికారులను అదేశించారు. భారీ వర్షం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి అధికారులతో సమీక్షించారు. జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని ఆదేశించారు. ఎక్కడ నీరు నిల్చినా సత్వరం స్పందించాలని అన్నారు. రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు.  రోడ్లపై గుంతలు తవ్వి పూడ్చకుండా వదిలేసిన జియో, ఎల్ అండ్ టి పై జీహెచ్ఎంసీ కేసులను నమోదు చేసింది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here