జులై 17 రాష్ట్రపతి ఎన్నిక

రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ఖారారయింది. జులై17వ తేదీన రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుంది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నసీమ్ జైదీ ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నిక కోసం జూన్ 14న నోటిఫికేషన్ జారీచేయనున్నారు. జులైన 17న పోలింగ్ , 20వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్రపతి పదవికోసం పోటీ చేసే అభ్యర్థులు జూన్ 28వ తేదీ లోగా నామినేషన్ ను దాఖలు చేయాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతల శాసన సభ, మండలి సభ్యులతో కూడిన ఎలక్ట్రోల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. రాష్ట్రపతి ఎన్నికల కోసం నామినేషన్ వేసే అభ్యర్థులను కనీసం 50 మంది సభ్యులు ప్రతిపాదించాల్సి ఉండగా మరో 50 మంది దానికి మద్దతు పలకాల్సి ఉంటుంది. ఒక్కో అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చు. రాష్ట్రపతి ఎన్నికకు అన్ని రాష్ట్రాల్లోనూ పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం జులై 24తో ముగియనుంది. అప్పటి కల్లా కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికలకు రాజకీయ పార్టీలు విప్ జారీ చేసే అవకాశం ఉండదు. అధికార ఎన్డీఏ కానీ, విపక్ష పార్టీలు కానీ ఇంకా తమ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేది ప్రకటించాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *