ఈ కుంబ్లే మా కొద్దు…

టీం ఇండియా కోచ్ అనీల్ కుంబ్లెను మార్చాల్సిందేనని జట్టు సభ్యుల్లో అధికశాతం ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.  భారత క్రికెట్ జట్టు కోచ్ గా అనీల్ కుంబ్లే పదవీ కాలం జూన్ 20తో ముగుస్తోంది. కుంబ్లేతో తమకు వద్దని కొత్త కోచ్ ను నియమించాలంటూ ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లలో అధికశాతం కోరుకుంటున్నట్టు సమాచారం. కెప్టేన్ విరాట్ కోహ్లీ కూడా కోచ్ మార్చాలిందేనంటూ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. విరాట్ కే ఎక్కువ మంది జట్టు సభ్యులు మద్దతు పలుకుతున్నట్టు సమాచారం. ప్రస్తుత జట్టులోని 10 మంది ఆటగాళ్లు కోచ్ గా కుంబ్లేను మార్చాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. రవిశాస్త్రి నుండి కోచ్ గా పగ్గాలు స్వీకరించిన కుంబ్లే జట్టును విజయపథంలో నడపించారు. కుంబ్లే కోచ్ గా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు అక్కడ సిరీస్ ను కైవసం చేసుకుంది. అక్కడి నుండి కుంబ్లే కోచ్ గా జట్టు ప్రతీ సిరీస్ లోనూ విజయఢంకా మోగించింది. దీనితో కుంబ్లేనే భారత జట్టు కోచ్ గా రెండో ఏడాది కూడా కొనసాగడం ఖాయం అని అంతా భావిస్తున్న సమయంలో హఠాత్తుగా కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించడం సంచలనం రేపింది. కోచ్ కు కెప్టెన్ కు మధ్య వివాదాలు ముదిరిన నేపధ్యంలో కోహ్లీ ఒత్తిడి మేరకు కోచ్ ను మార్చాలనే నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా జట్టులోని ఆటగాళ్లలో అధికశాతం మంది కుంబ్లేను మార్చాల్సిందేనంటూ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.
ఆటగాళ్ల పట్ల కుంబ్లే చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడని అతన్ని తట్టుకోవడం తమ వల్ల కాదని జట్టు సభ్యులు అంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం కెప్టెన్ విరాట్ కోహ్లీ బోర్డు సభ్యులకు చెప్పగా తాజాగా జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా కుంబ్లేతో తాము వేగలేకపోతున్నామని ఆయన్ను తప్పించాల్సిందేనని అంటున్నట్టుగా సమాచారం. కోచ్ కోసం బీసీసీఐ ధరఖాస్తులను ఆహ్వానించగా కుంబ్లే కూడా ధరఖాస్తు చేసుకున్నాడు. కుంబ్లేతో పాటుగా మరో మాజీ క్రికెటర్ వీరేంద్ర సేహ్వాగ్ కూడా కోచ్ పదవి కోసం ధరఖాస్తు చేసుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *